Video: వామ్మో.. ధోని గ్యారేజ్ చూశారా.. షోరూమ్‌లోనూ ఇన్ని బైక్‌లు ఉండవేమో.. వీడియో చూస్తే కళ్లుబైర్లే..

MS Dhoni Bike Collection: ధోనీ బైక్ ప్రేమ గురించి మనందరికీ తెలిసిందే. అయితే, మొదటిసారి ఈ వీడియో ప్రపంచం ముందు వచ్చింది. ధోనీ గ్యారేజ్‌లో కలెక్షన్స్ చూస్తే మతిపోవాల్సిందే.

Video: వామ్మో.. ధోని గ్యారేజ్ చూశారా.. షోరూమ్‌లోనూ ఇన్ని బైక్‌లు ఉండవేమో.. వీడియో చూస్తే కళ్లుబైర్లే..
Ms Dhoni Bike Collection
Follow us
Venkata Chari

|

Updated on: Jul 18, 2023 | 10:48 AM

Dhoni Bikes Video: ధోని వద్ద ఎన్ని బైక్‌లు ఉన్నాయి? ధోని దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి? ఎలాంటి బైక్‌లు ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మాత్రం.. చాలా కష్టపడాల్సిందే. ఎందుకంటే.. ధోని వద్ద ఉన్న కలెక్షన్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఈ క్రమంలో తొలిసారిగా ఎంఎస్ ధోని గ్యారేజ్ ప్రపంచం ముందుకు వచ్చింది. ధోని గ్యారేజీలో ఉన్నన్ని బైక్‌లు ఏ షోరూమ్‌లోనూ లేవని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఏది ప్రత్యేకంగా కనిపించినా.. అది ధోని గ్యారేజ్‌లోకి రావాల్సిందే. బైక్‌లు, కార్లు అంటే ధోనీకి అంత పిచ్చి అన్నమాట. పాత కార్ల నుంచి లేటెస్ట్ మోడల్స్ వరకు ధోని గ్యారేజ్‌లో చూడొచ్చు.

ధోని బైక్ ప్రేమ మనందరికీ తెలుసిందే. కానీ, మొదటిసారి ఈ వీడియో ప్రపంచం ముందు వచ్చింది. ఇక, ఈ విషయాన్ని భారత మాజీ క్రికెటర్లు వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషి తెరపైకి తీసుకువచ్చాడు. 90ల నాటి ఈ ఇద్దరు ఆటగాళ్లు రాంచీ పర్యటన సందర్భంగా ధోనీ ఫామ్‌హౌస్‌కి చేరుకున్నారు. ధోనీ తన నిజమైన నిధిని అంటే గ్యారేజీని ఇందులో చూపించాడు. అది చూడగానే కళ్లు బైర్లు కమ్ముతాయంతే.

ఇవి కూడా చదవండి

వీడియో చూస్తే పరేషానే..

ధోనీ అభిమానుల మాదిరిగానే, వెంకటేష్ ప్రసాద్, సునీల్ జోషికి ఎంఎస్‌డీ బైక్ ప్రేమ గురించి తెలుసు. కానీ, మొదటిసారిగా వీరికి ధోని గ్యారేజ్‌ను చాలా దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. ధోనీ వీరి కోసం ఈ అమూల్యమైన నిధిని చూఇంచాడు. ఇది చూసిన తర్వాత వెంకటేష్ ప్రసాద్ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు.

ధోనీకి బైక్‌లంటే ఎంత ఇష్టమో వెంకటేష్ ప్రసాద్ షేర్ చేసిన ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ధోని గ్యారేజీలో ప్రతి కొత్త, పాత బైక్‌ల సేకరణను చూడొచ్చు. ధోని సేకరణలో ఒక్కో బ్రాండ్‌కు చెందిన బైక్‌లు, కార్లు.. ఒక్కో స్పెషాలిటీ కనిపించాయి. దీని గురించి తెలుసుకోవాలని ప్రపంచం ఆసక్తిగా ఉంది.

గ్యారేజీకి మెకానిక్‌గా ధోని..!

బైక్‌ల విస్తృత సేకరణతో పాటు, ధోనీకి పాతకాలపు కార్ల జాబితా కూడా ఉంది. వీటిలో కొన్ని ధోని దిగుమతి చేసుకున్న కార్లు కాగా, మరికొన్ని భారత ఆర్మీ నుంచి కొనుగోలు చేసినవి. అతిపెద్ద విషయం ఏమిటంటే, ధోని తన గ్యారేజీలో ఉన్న అన్ని బైక్‌లను చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. వీటికి సర్వీసింగ్ కూడాచేస్తుంటాడు. కొన్నిసార్లు దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌ రిటైర్‌మెంట్‌పై ఇంకా స్పష్టత లేదు..

తాజాగా జులై 7న ధోనీ తన 42వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్ 16లో కూడా తన కెప్టెన్సీలో చెన్నైని విజేతగా నిలిపాడు. అదే సమయంలో తన రిటైర్మెంట్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?