
IND vs NZ: టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. సెమీఫైనల్‌లో భారత జట్టు ఇంగ్లాడ్ ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టులో ఒక కీలక మార్పు జరిగే అవకాశంపై చర్చ జరుగుతోంది.
భారత్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాడు. ఇంగ్లాండ్‌పై బౌలింగ్ చేసిన అతను 4 ఓవర్లలో 64 పరుగులు ఇచ్చి, 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. దీంతో ఇది అతని టీ20 కెరీర్‌లో అత్యంత ఖరీదైన స్పెల్‌లలో ఒకటిగా నిలిచింది.
అయితే ఈ టీమిండియా మిస్ట్రీ స్పిన్నర్ జోస్ బట్లర్ (Jos Buttler) కీలక వికెట్ తీసినప్పటికీ మిగతా సమయంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు అతని బౌలింగ్‌లో భారీగా పరుగులు సాధించారు.
ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర స్టేడియంలో జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని భావిస్తున్నట్లు సమాచారం. న్యూజిలాండ్‌పై బౌలింగ్ బలాన్ని పెంచేందుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
వరుణ్ చక్రవర్తి స్థానంలో మరో అనుభవజ్ఞుడైన స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ జాబితాలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav). కుల్దీప్ తన స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కుదేలు చేయగల సామర్థ్యం కలిగిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అతనికి అవకాశం ఇస్తే న్యూజిలాండ్ బ్యాటర్లకు పెద్ద సవాల్ కావచ్చు.
జట్టులో బ్యాటింగ్-బౌలింగ్ సమతౌల్యం కోసం ఒక అదనపు ఆల్‌రౌండర్‌ను కూడా తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ఫైనల్‌కు ముందు భారత్ తీసుకునే పెద్ద వ్యూహాత్మక నిర్ణయంగా మారవచ్చు.
ఇప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), కోచింగ్ స్టాఫ్ తీసుకునే నిర్ణయం టీమ్ ఇండియాను వరల్డ్ చాంపియన్‌గా నిలబెడుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..