Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా.. ఐపీఎల్‌లో అసలైన యుద్ధం మొదలైంది

Vaibhav Suryavanshi : రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ, ముంబై స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో తలపడనున్నాడు. ఈ పోరు వైభవ్ టీమిండియా ఎంట్రీకి ఒక గొప్ప అవకాశమని నిపుణులు భావిస్తున్నారు. ఐపీఎల్ 2026లో వైభవ్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా.. ఐపీఎల్‌లో అసలైన యుద్ధం మొదలైంది
Vaibhav Suryavanshi Vs Jasprit Bumrah

Updated on: Apr 07, 2026 | 12:09 PM

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈసారి పోటీ కేవలం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్యే కాదు.. ఒక 15 ఏళ్ల కుర్రాడికి, ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌కు మధ్య. అవును, రాజస్థాన్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ వర్సెస్ ముంబై డెత్ ఓవర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా మధ్య జరగబోయే పోరు కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గౌహతి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఈ ఇద్దరి మధ్య పోరు హైలైట్‌గా నిలవనుంది.

గత సీజన్‌లోనే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటికీ, బుమ్రాతో తలపడే అవకాశం రాలేదు. ఆ మ్యాచ్‌లో వైభవ్ రెండో బంతికే అవుట్ కావడంతో బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయాడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఐపీఎల్ 2026లో వైభవ్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. దిగ్గజ బౌలర్లను సైతం అలవోకగా సిక్సర్లు బాదుతున్నాడు. ఈ క్రమంలో బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్‌ను వైభవ్ ఎలా ఎదుర్కుంటాడనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

వైభవ్ సూర్యవంశీ కోచ్ మనీష్ ఓజా ఈ పోరుపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “బుమ్రా బంతులను బాదడం ఎవరికీ అంత సులభం కాదు. కానీ వైభవ్‌కు బౌలర్లను ఉతికి ఆరేయడమే ఇష్టం. ఈ ఇద్దరూ తలపడితే అది అద్భుతమైన ఫైట్ అవుతుంది” అని పేర్కొన్నారు. బుమ్రాను ఎదుర్కోవడం వైభవ్‌కు ఒక పెద్ద సవాల్ మాత్రమే కాదు, టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడటానికి ఇదొక గొప్ప అవకాశం అని కోచ్ అభిప్రాయపడ్డారు.

బుమ్రా లాంటి టాప్ బౌలర్‌పై వైభవ్ పైచేయి సాధించి పరుగులు రాబడితే, అది అతడి కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుంది. ఏ ఒత్తిడినైనా తట్టుకోగలడని, ప్రపంచంలో ఏ బౌలింగ్ అటాక్‌నైనా చిన్నాభిన్నం చేయగలడని వైభవ్ నిరూపించుకున్నట్లవుతుంది. బుమ్రా బౌలింగ్‌లో సత్తా చాటితే, భారత సెలక్టర్లు అతడిని టీమిండియాలోకి తీసుకునే విషయంలో వెనకాడరని, జాతీయ జట్టు తలుపులు త్వరగా తెరుచుకుంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

జస్ప్రీత్ బుమ్రా అంటేనే బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేయడంలో దిట్ట. పవర్ ప్లే అయినా, డెత్ ఓవర్లయినా వికెట్లు తీయడంలో అతడికి సాటిలేరు. వైభవ్ తన స్కిల్స్, మానసిక సామర్థ్యంతో బుమ్రా యార్కర్లను ఎలా అడ్డుకుంటాడో చూడాలి. 15 ఏళ్ల వయసులోనే బుమ్రా లాంటి దిగ్గజాన్ని ఎదుర్కోవడం వైభవ్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us