Vaibhav Suryavanshi : 15 ఏళ్ల వయసు.. 15 భారీ లక్ష్యాలు.. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టిస్తాడా?

Vaibhav Suryavanshi : 15 ఏళ్ల బిహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇవాళ (మార్చి 27) తన 15వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగుతున్నాడు. గేల్, కోహ్లీ రికార్డులే లక్ష్యంగా అతను ఎదుర్కోబోయే 15 సవాళ్ల గురించి చూద్దాం.

Vaibhav Suryavanshi  : 15 ఏళ్ల వయసు.. 15 భారీ లక్ష్యాలు.. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టిస్తాడా?
Vaibhav Suryavanshi

Updated on: Mar 27, 2026 | 4:22 PM

Vaibhav Suryavanshi : బిహార్ నుంచి వచ్చిన క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇవాళ (మార్చి 27) తన 15వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ పుట్టినరోజు వైభవ్‌కు చాలా స్పెషల్.. ఎందుకంటే 15 ఏళ్లు నిండడంతో ఈ యువ కెరటం అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు అర్హత సాధించాడు. ఇప్పటికే ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగుతున్న ఈ లిటిల్ మాస్టర్ ముందు ఇప్పుడు 15 భారీ సవాళ్లు ఉన్నాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం.

వైభవ్ సూర్యవంశీ ముందున్న 15 సవాళ్లు:

* రాజస్థాన్ రాయల్స్‌ను ఛాంపియన్‌గా నిలపడం: 2008 తర్వాత రాజస్థాన్ రెండో టైటిల్ కోసం ఎదురుచూస్తోంది. అండర్-19 వరల్డ్ కప్ గెలిచినట్లుగానే, రాజస్థాన్‌కు ట్రోఫీ అందించడం వైభవ్ ముందున్న మొదటి లక్ష్యం.

* క్రిస్ గేల్ 175 పరుగుల రికార్డు: టీ20ల్లో గేల్ నెలకొల్పిన 175 పరుగుల అత్యధిక స్కోరును దాటాలని వైభవ్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ సీజన్లో ఆ అద్భుతం జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

* టీమిండియా డెబ్యూ: 15 ఏళ్లు నిండడంతో భారత్ తరపున ఆడేందుకు అర్హత సాధించాడు. ఈ ఐపీఎల్ లో రాణిస్తే అత్యంత పిన్న వయసులో టీమిండియాకు ఆడిన ప్లేయర్ గా రికార్డు సృష్టిస్తాడు.

* లిస్ట్-ఏ లో డబుల్ సెంచరీ: ఇండియా-ఏ లేదా అండర్-19 స్థాయిలో వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టడం వైభవ్ ముందున్న మరో సవాల్.

* ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు: ఒకే మ్యాచ్‌ లో గేల్ బాదిన 17 సిక్సర్ల రికార్డును తిరగరాయాలని వైభవ్ పట్టుదలతో ఉన్నాడు.

* ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ: ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న 31 బంతుల సెంచరీ రికార్డును అంతర్జాతీయ లేదా దేశీవాళీ స్థాయిలో బద్దలు కొట్టడం.

* ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు: 2012లో గేల్ కొట్టిన 59 సిక్సర్ల రికార్డుపై వైభవ్ కన్నేశాడు.

* 100 టీ20 సిక్సర్లు: ఇప్పటికే 62 సిక్సర్లు బాదిన వైభవ్, ఈ ఐపీఎల్ సీజన్ ముగిసేలోపు 100 సిక్సర్ల మైలురాయిని చేరాలి.

* ఒకే ఓవర్లో 6 సిక్సర్లు: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టలేదు. ఆ రికార్డును తన ఖాతాలో వేసుకోవాలని వైభవ్ చూస్తున్నాడు.

* ఆరెంజ్ క్యాప్ విజేత: 15 ఏళ్ల వయసులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్ గెలవడం ఒక అసాధారణ సవాల్.

* ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ: గేల్ పేరిట ఉన్న 30 బంతుల సెంచరీ రికార్డును వైభవ్ అధిగమించగలడా అనేది చూడాలి.

* టీనేజర్ గా అత్యధిక పరుగులు: పృథ్వీ షా పేరిట ఉన్న 598 పరుగుల రికార్డును వైభవ్ దాటాలి. ప్రస్తుతం వైభవ్ ఖాతాలో 252 పరుగులు ఉన్నాయి.

* సీజన్లో అత్యధిక సెంచరీలు: విరాట్ కోహ్లీ ఒకే సీజన్లో చేసిన 4 సెంచరీల రికార్డును వైభవ్ టార్గెట్ చేస్తున్నాడు.

* అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు: ఒకే సీజన్లో కోహ్లీ సాధించిన 11 ఫిఫ్టీ ప్లస్ స్కోర్ల రికార్డును ఈ యువకెరటం చేరుకోవాల్సి ఉంటుంది.

* అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు: 2016లో కోహ్లీ గెలుచుకున్న 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రికార్డును బ్రేక్ చేయడం వైభవ్ ముందున్న 15వ ఛాలెంజ్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us