Video: 6,4,6,6.. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన బుడ్డోడు.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!

Vaibhav Sooryavanshi Batting Video: భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ సూర్యవంశీ ఒక బలమైన ఆశాకిరణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. నెట్స్‌లో అతడు చూపించిన తెగింపు, ఆత్మవిశ్వాసం అంతర్జాతీయ వేదికపై కూడా కొనసాగితే, ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా కొత్త చరిత్ర సృష్టించడం ఖాయం.

Video: 6,4,6,6.. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన బుడ్డోడు.. ఇంగ్లాండ్‌లో వైభవ్ రచ్చ మాములుగా లేదుగా..!
Vaibhav Sooryavanshi Batting Video

Updated on: Jul 01, 2026 | 8:06 PM

Vaibhav Sooryavanshi Batting Video: ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా టీ20 సమరానికి సర్వం సిద్ధమైంది. నేటి నుంచే భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల పొట్టి సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో తుఫాన్ రేపాడు. నెట్ ప్రాక్టీస్‌లో సీనియర్ బౌలర్లను ఉతికారేస్తూ అతడు ఆడిన షాట్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఐపీఎల్ హీరో.. టీమిండియా ఆశల కిరణం..

భారత క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులోనే పెను సంచలనాలు సృష్టిస్తున్న అద్భుత ప్రతిభావంతుడు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026 సీజన్‌లో తన మునుపటి మెరుపు బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన ఈ 15 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. ఐర్లాండ్ పర్యటనలోనే ఈ చిన్నవాడు అరంగేట్రం చేస్తాడని అభిమానులు ఆశించినప్పటికీ, టీమ్ మేనేజ్‌మెంట్ సీనియర్ల వైపే మొగ్గు చూపడంతో వైభవ్‌కు బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం.. ప్లేయింగ్ 11లో చోటిస్తే చుక్కలే ఇక

నెట్స్‌లో ఇంగ్లాండ్ సిరీస్ ముంగిట వీరవిహారం..

ఐర్లాండ్‌లో నిరాశ ఎదురైనా వైభవ్ మాత్రం పట్టువదలకుండా శ్రమిస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి టీ20 జరగనున్న డర్హామ్ వేదికగా జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో ఈ యువ కెరటం చెలరేగిపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ వంటి అగ్రశ్రేణి భారత పేసర్లతో పాటు ఎంతోమంది స్పెషలిస్ట్‌ బౌలర్లను కూడా వైభవ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. క్రీజు వెలుపలికి వచ్చి మరీ అతడు బాదిన లాంగ్ సిక్సర్లు, క్లాస్ బౌండరీలు చూసి సహచర ఆటగాళ్లే నోరెళ్లబెట్టారు. ఈ వీరబాదుడు వీడియోను స్టార్ స్పోర్ట్స్ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో, అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: IND vs ENG 1st T20I: బుడ్డోడిని తొలి బంతికే ఇంటికి పంపిస్తా.. తొడగొట్టి మరీ సవాల్ చేసిన వైభవ్ దోస్త్..!

తుది జట్టులో చోటు దక్కేనా?

ఇంగ్లాండ్‌తో జరిగే ఈ సుదీర్ఘ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్‌కు డెబ్యూ చాన్స్ వస్తుందా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మొదటి మ్యాచ్‌లోనే అతనికి అవకాశం రాకపోయినా, సిరీస్ మధ్యలో లేదా ఆఖరి మ్యాచ్‌ల్లోనైనా మేనేజ్‌మెంట్ అతడిని పరీక్షించే అవకాశం ఉంది. అభిమానులు, పలువురు మాజీ క్రికెటర్లు సైతం వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తన ప్రాక్టీస్ తీరును చూస్తుంటే, ఇంగ్లీష్ బౌలర్ల భరతం పట్టడానికి ఈ యువ కిశోరం ఎంతగానో తహతహలాడుతున్నట్లు స్పష్టమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us