Vaibhav Sooryavanshi : మ్యాచ్ చూడటానికి రాజస్థాన్ నుంచి జింబాబ్వే‎కు వృద్ధురాలు.. వైభవ్ క్రేజ్ వేరే లెవెల్ అంతే

Vaibhav Sooryavanshi : రాజస్థాన్ నుంచి జింబాబ్వే వరకు ప్రయాణించి 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని కలిసిన వృద్ధురాలి వీడియో వైరల్ అవుతోంది. ఐపీఎల్ స్టార్‌గా ఎదిగిన వైభవ్‌పై అభిమానుల ప్రేమ, జింబాబ్వే టీ20 సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Vaibhav Sooryavanshi : మ్యాచ్ చూడటానికి రాజస్థాన్ నుంచి జింబాబ్వే‎కు వృద్ధురాలు.. వైభవ్ క్రేజ్ వేరే లెవెల్ అంతే
Vaibhav Sooryavanshi

Updated on: Jul 22, 2026 | 7:27 AM

Vaibhav Sooryavanshi : టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్‎మెన్, 15 ఏళ్ల విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం భారత్-జింబాబ్వే టీ20 సిరీస్ కోసం టీమిండియాతో కలిసి జింబాబ్వేలో ఉన్న ఈ యంగ్ ప్లేయర్‌ను కలిసేందుకు అభిమానులు దేశాలు దాటి వస్తున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా జింబాబ్వే వెళ్లిన ఒక భారతీయ కుటుంబానికి చెందిన వృద్ధురాలు వైభవ్‌ను కలిసి ఆశీర్వదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

రాజస్థాన్ నుంచి జింబాబ్వే దాకా

మూడు టీ20ల సిరీస్ ప్రారంభానికి ముందు ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వైభవ్‌ను కలిసిన ఆ వృద్ధురాలు ఎంతో ఆప్యాయంగా.. “నమస్తే వైభవ్ బిడ్డ.. మా కుటుంబమంతా నీకు పెద్ద అభిమానులు. కేవలం నీ బ్యాటింగ్ ప్రత్యక్షంగా చూడటం కోసమే మేము రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇంత చిన్న వయసులోనే దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచావు. భారతదేశం కోసం మరెన్నో పరుగులు సాధించి దేశ పేరు నిలబెట్టాలి. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ చల్లగా చూడాలి” అని ఆశీర్వదించారు. దీనికి స్పందించిన వైభవ్ సూర్యవంశీ నవ్వుతూ.. “చాలా చాలా ధన్యవాదాలు ఆంటీ, మీ ఆశీస్సులు, ప్రోత్సాహం నాకు చాలా విలువైనవి” అని వినయంగా బదులిచ్చాడు.

జింబాబ్వేలో భారీ ఇన్నింగ్స్‌పై కన్ను

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఏకంగా 776 పరుగులు సాధించి రికార్డులతో వార్తల్లో నిలిచిన వైభవ్ సూర్యవంశీకి భారత జాతీయ జట్టులో చోటు లభించింది. ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైనప్పటికీ, ఇంగ్లాండ్‌పై రెండో టీ20లో అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. అయితే ఆ సిరీస్‌లోని మూడు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేసి ఆకట్టుకోలేకపోవడంతో చివరి మ్యాచ్‌కి దూరమయ్యాడు. ఇప్పుడు జింబాబ్వే సిరీస్‌ ద్వారా ఇంగ్లాండ్ పర్యటన నిరాశను తుడిచిపెట్టేసి, ఓపెనర్‌గా చెలరేగి పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని ఈ కుర్రాడు పట్టుదలతో ఉన్నాడు.

ఇది కూడా చదవండి : Kavya Maran : అందరూ రూల్స్ పాటిస్తుంటే.. కావ్య మేడమ్ మాత్రం సైలెంట్‌గా గేమ్ మార్చేసిందిగా

జూలై 23 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం

భారత్, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూలై 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా జరగనుంది. ఈ పర్యటనకుగానూ భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు విశ్రాంతిని ఇవ్వడంతో, ఎన్‌సిఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. సునీల్ జోషి, హృషికేష్ కనిత్కర్ సపోర్ట్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు లార్డ్స్ మైదానంలో చారిత్రాత్మక విజయం సాధించిన భారత మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ మార్పుపై మాజీ దిగ్గజాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం కూడా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us