SL vs AUS: క్రికెట్ అంటేనే ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్. గెలుపు ఓటముల విషయాన్ని పక్కన పెడితే మ్యాచ్ జరుగుతున్నంతసేపు జరిగే సంఘటనలు కూడా ప్రేక్షకులను వినోదాన్ని పంచుతాయి. ఇలాంటి ఎన్నో ఫన్నీ సంఘటనల సమ్మేళనమే క్రికెట్ మ్యాచ్. తాజాగా కొలంబో వేదికగా ఆస్ట్రేలియా, శ్రీలంకల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఓ ఫన్నీ సంఘటన జరిగింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ విషయమేంటంటే.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆలెక్స్ క్యారీ షార్ట్ పిచ్ బాల్‌ను స్వ్కేర్ లెగ్ దిశగా ఆడాడు కాసేపు బంతిలో గాల్లో ఎగిరింది. అయితే అక్కడే స్క్వేర్ లెగ్‌లో ఉన్న అంపైర్ కుమార్ ధర్మసేన తాను అంపైర్ అనే విషయాన్ని మర్చిపోయారో లేదా పొరపాటునో తెలియదు కానీ, బంతిని క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నించాడు.
అయితే వెంటనే తేరుకొని చేతులను వెనక్కి తీసుకున్నాడు. దీంతో గ్రౌండ్‌లో ఉన్న ఆటగాళ్లు ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఇక ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మరి నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Kumar Dharmasena going for a catch in SL vs Aus Odi match pic.twitter.com/DYyxn6kEsy
— Sportsfan Cricket (@sportsfan_cric) June 20, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..