IPL 2025: సూపర్‌ సండే.. IPLలో ఇవాళ రెండు మ్యాచ్‌లు.. అభిమానులకు పండగే పండగ!

సండే..పైగా ఐపీఎల్‌ సీజన్ ఇక ఇవాళ క్రికెట్ అభిమానులకు పండగనే చెప్పాలి. ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ రెండు హైవోల్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది.ఈ మ్యాచ్ జైపూర్ లోని సవాయి మన్సింగ్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం కానున్న జరుగుతుంది. రెండో మ్యాచ్‌ ఢిల్లీ క్యాపిటల్స్ (DC), ముంబై ఇండియన్స్ (MI) మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ రెండు టీమ్‌ల మధ్య గట్టి పోటీ ఉంటుంది, మరి ఈ రోజు ఎవరు గెలుస్తారో చూడాలి!

IPL 2025: సూపర్‌ సండే.. IPLలో ఇవాళ రెండు మ్యాచ్‌లు.. అభిమానులకు పండగే పండగ!
Rcb Va Rr

Updated on: Apr 13, 2025 | 9:42 AM

తొలి మ్యాచ్‌లో భాగంగా ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌, ఐదవ స్థానంలో ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలబడనున్నాయి. రాజస్థాన్‌తో జరగబోయే ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త జెర్సీ ధరించి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. గత అన్ని సీజన్‌లలో లాగానే ఈసారి కూడా గ్రీన్ కలర్ జెర్సీతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్‌ ఆడనుంది. “గో గ్రీన్” ఇనిషియేటివ్‌తో ప్రతి సీజన్‌లో ఇలా ఒక మ్యాచ్‌లో గ్రీన్‌ జెర్సీని ధరించి ఆడటం బెంగళూరుకు ఆనవాయితీగా వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే పర్యావరణ సమస్యల గురించి అవగాహన కల్పించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బెంగళూరు ఈ గ్రీన్ జెర్సీని ధరిస్తుంది. ఇది ఫ్రాంచైజీ విస్తృతమైన స్థిరత్వ కార్యక్రమాలను తెలియజేస్తుంది. అయితే గత సీజన్‌లలో కన్నా ఈ సీజన్‌లో బెంగళూరు కాస్త దూకుడుగా ఆడుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లో మూడింటిలో విజయం సాధించింది. అటు రాజస్థాన్‌ కూడా ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచుల్లో విజయం సాధించి మూడు మ్యాచుల్లో ఓడిపోయింది.

ఇక రెండవ మ్యాచ్ విషయానికొస్తే ఈ సీజన్‌లో వరుస విజయాలతో దూకుడుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ముంబై ఇండియన్స్‌తో తలబడనుంది. సీజన్‌ 18లో ఆడిన అన్ని మ్యాచుల్లో గెలిచిన ఏకైక జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆడిన నాలుగు మ్యాచుల్లో ఢిల్లీ విజయం సాధించింది. ఇక ముంబై విషయానికొస్తే ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం ఒకే ఒక్క గెలుపుతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతుంది. రాత్రి 7:30 గంటలకు ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తుంది. ఢిల్లీలో ఇవాళ రాత్రి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..