Video: సిక్స్ కొట్టాడని బ్యాటర్‌పై ప్రస్టేషన్.. లైవ్ మ్యాచ్‌లో రెచ్చిపోయిన బౌలర్.. వైరల్ వీడియో

Tshepo Ntuli Fight Ripon Mondol: దక్షిణాఫ్రికా ఎమర్జింగ్ జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. రెండు జట్ల మధ్య జరిగిన రెండవ అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసింది. ఈ మ్యాచ్ సమయంలో ఇద్దరు ఆటగాళ్ళు ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Video: సిక్స్ కొట్టాడని బ్యాటర్‌పై ప్రస్టేషన్.. లైవ్ మ్యాచ్‌లో రెచ్చిపోయిన బౌలర్.. వైరల్ వీడియో
Tshepo Ntuli Fight Ripon Mondol

Updated on: May 29, 2025 | 8:17 AM

Ban vs SA Emerging Test Tshepo Ntuli Fight Ripon Mondol: క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు, మాటల యుద్ధాలు సాధారణం. కానీ, కొన్నిసార్లు అవి ఫైటింగ్‌కు కూడా దారితీస్తుంటాయి. ఇలాంటి సంఘటన తాజాగా బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా ఎమర్జింగ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్ టీషేపో న్తులి, బంగ్లాదేశ్ బ్యాటర్ రిపన్ మోండోల్ మధ్య మైదానంలో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగడమే కాకుండా, అది తోపులాటకు దారితీసింది. ఈ సంఘటన అభిమానులను, కామెంటేటర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది.

అసలేం జరిగింది?

ఇవి కూడా చదవండి

ఢాకాలో జరుగుతున్న ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో, బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తుండగా, రిపన్ మోండోల్ దక్షిణాఫ్రికా బౌలర్ టీషేపో న్తులి బౌలింగ్‌లో ఒక భారీ సిక్స్ కొట్టాడు. ఆ సిక్స్ కొట్టిన తర్వాత, రిపన్ మోండోల్ తన నాన్-స్ట్రైకర్ పార్ట్‌నర్‌కు వైపు నడుస్తున్నప్పుడు, న్తులిని చూస్తూ ఏదో అన్నాడు. ఇది న్తులిని ఆగ్రహానికి గురిచేసినట్లుంది. వెంటనే న్తులి రిపన్ వైపు దూసుకొచ్చి, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది.

ఈ వాగ్వాదం కాస్తా తోపులాటకు దారితీసింది. న్తులి రిపన్ హెల్మెట్‌ను పట్టుకుని లాగినట్లు వీడియోలలో స్పష్టంగా కనిపించింది. ఈ సంఘటనతో మైదానంలోని ఇతర ఆటగాళ్లు, అంపైర్లు వెంటనే కల్పించుకుని ఇద్దరినీ విడదీశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అంపైర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. కామెంటేటర్లు కూడా ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇది క్రికెట్‌కు మంచిది కాదని వ్యాఖ్యానించారు.

ఈ సంఘటనకు సంబంధించి మ్యాచ్ అధికారులు ఇంకా అధికారిక నివేదికను సమర్పించలేదు. అయితే, మ్యాచ్ రిఫరీ సలీం షాహెద్ ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, త్వరలో నివేదికను సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB, క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) ఇద్దరు ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో కూడా ఈ సిరీస్‌లో ఒక వన్డే మ్యాచ్ సందర్భంగా ఆండిల్ సిమెలనే, జిషాన్ ఆలంలపై నిషేధం విధించారు.

ఎమర్జింగ్ ప్లేయర్స్ స్థాయిలో జరిగే ఇలాంటి మ్యాచ్‌లు యువ క్రికెటర్లకు తమ సత్తా చాటుకోవడానికి ఒక వేదికగా నిలుస్తాయి. అయితే, ఇలాంటి సంఘటనలు ఆట స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటాయి. ఆటగాళ్లు మైదానంలో తమ ప్రవర్తన పట్ల మరింత బాధ్యతాయుతంగా ఉండాలని, ఇలాంటి ఘర్షణలను నివారించాలని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై రెండు దేశాల బోర్డులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..