
Trent Boult Auction Price: ట్రెంట్ బౌల్ట్ IPL 2022 వేలంలో రాజస్థాన్ రాయల్స్ సొంతమయ్యాడు. 8 కోట్ల భారీ మొత్తానికి అతన్ని రాయల్స్ తీసుకుంది. న్యూజిలాండ్ ఆటగాడు, లెఫ్టార్మ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఐపిఎల్‌లో చాలా విజయవంతమయ్యాడు. అతను గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుతో ఉన్నాడు. అతని కోసం ఆర్సీబీ, రాయల్స్ పోటీ పడ్డాయి. చివరికి అతన్ని రాజస్థాన్ దక్కించుకుంది.
ట్రెంట్ బౌల్ట్ ప్రపంచంలోని అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు. అతను పవర్‌ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. అలాగే, స్లాగ్ ఓవర్లలో కూడా అతని హవా కనిపిస్తుంది. ట్రెంట్ బౌల్ట్ తన ఫీల్డింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల శక్తి కూడా కలిగి ఉన్నాడు. అందుకే ఐపీఎల్‌లో అతనికి చాలా డిమాండ్ ఉంది. ట్రెంట్ బౌల్ట్ తొలిసారి 2015లో ఐపీఎల్‌లోకి వచ్చాడు. అప్పుడు అతనికి రూ.3.80 కోట్లు వచ్చాయి. 2016లో కూడా అదే జట్టులో కొనసాగాడు. ఆ తర్వాత 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని తీసుకుంది. ఐపీఎల్‌లో 62 మ్యాచ్‌లు ఆడి 76 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ 8.4 మరియు వికెట్ టేకింగ్ సగటు 26.09. 18 పరుగులకే నాలుగు వికెట్లు తీయడం అతని అత్యుత్తమ ప్రదర్శన.
32 ఏళ్ల ట్రెంట్ బౌల్ట్‌కు టీ20 క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. 44 మ్యాచ్‌లు ఆడి 62 వికెట్లు తీశాడు. అదే సమయంలో టెస్టుల్లో 301 వికెట్లు, 93 వన్డేల్లో 169 వికెట్లు పడగొట్టాడు. అతను న్యూజిలాండ్‌లో అగ్రగామి ఫాస్ట్ బౌలర్.