
Toyota : టయోటా కిర్లోస్కర్ మోటార్ సంస్థ టీమిండియా లీడ్ స్పాన్సర్‌గా మారేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఆన్‌లైన్ గేమింగ్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్, 2025 కారణంగా డ్రీమ్11 స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవడంతో ఈ ఖాళీ ఏర్పడింది. అయితే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఇంకా కొత్త ప్రధాన స్పాన్సర్‌షిప్ కోసం అధికారిక టెండర్‌ను విడుదల చేయలేదు.
డ్రీమ్11 అవుట్.. టయోటా ఇన్!
బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా ఇటీవల పీటీఐతో మాట్లాడుతూ.. డ్రీమ్11 ఒప్పందం ముగిసిందని, కొత్త ప్రత్యామ్నాయం కోసం బోర్డు ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. ఒక వర్గం సమాచారం ప్రకారం.. టయోటా కిర్లోస్కర్ మోటార్ స్పాన్సర్‌గా మారడానికి ఆసక్తి చూపుతోంది. అయితే, బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి సంబంధించిన చట్టపరమైన అంశాలు, ప్రక్రియలు ఇంకా సమీక్షలో ఉన్నాయి. బీసీసీఐ రాబోయే ఐసీసీ మహిళల క్రికెట్‌కు ముందు ఈ ఒప్పందాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది.
డ్రీమ్11 ఎందుకు తప్పుకుంది?
ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్, 2025 అమల్లోకి వచ్చిన తర్వాత, రియల్-మనీ గేమింగ్‌పై నిషేధం కారణంగా డ్రీమ్11 స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో టీమిండియా ప్రధాన స్పాన్సర్ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం వెతుకుతోంది. ఈ రేసులో టయోటా కిర్లోస్కర్ మోటార్ ముందుందని భావిస్తున్నారు.
బీసీసీఐ వ్యూహం
బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా డ్రీమ్11తో ఒప్పందం ముగిసిందని, కొత్త స్పాన్సర్ కోసం వెతుకుతున్నామని ధృవీకరించారు. అయితే, అధికారిక టెండర్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. బీసీసీఐ చట్టపరమైన. ఇతర అంశాలను సమీక్షిస్తోంది. ఐసీసీ మహిళల క్రికెట్ టోర్నమెంట్‌కు ముందు ఈ ఒప్పందాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది టయోటాకు భారత క్రికెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం కావచ్చు.
రాబోయే సవాళ్లు
డ్రీమ్11 తప్పుకోవడంతో బీసీసీఐకి టైం లిమిట్ ఒక పెద్ద సవాలుగా మారింది. ఐసీసీ మహిళల క్రికెట్‌కు ముందు ఒప్పందం కుదరకపోతే, టీమిండియా ప్రధాన స్పాన్సర్ లేకుండానే ఆడాల్సి రావచ్చు. టయోటా కిర్లోస్కర్ మోటార్‌కు ఇది ఒక ముఖ్యమైన అవకాశం. కానీ, ఈ ఒప్పందం విజయం చట్టపరమైన అనుమతులపై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.