ODI: వన్డేల్లో బౌలర్లకు పీడకలలా మారిన ‘అమేజింగ్ బ్యాటర్లు’.. లిస్టులో టీమిండియా బ్యాటర్.. ఎవరంటే?

|

Dec 27, 2022 | 2:59 PM

వన్డే, టెస్ట్, టీ20.. ఇప్పటిదాకా క్రికెట్‌లో ఉన్న మూడు ఫార్మాట్లు ఇవే. అయితే ఇటీవల కొత్తగా టీ10, 100 లీగ్స్ వచ్చేశాయి.

ODI: వన్డేల్లో బౌలర్లకు పీడకలలా మారిన అమేజింగ్ బ్యాటర్లు.. లిస్టులో టీమిండియా బ్యాటర్.. ఎవరంటే?
Cricket
Follow us on

వన్డే, టెస్ట్, టీ20.. ఇప్పటిదాకా క్రికెట్‌లో ఉన్న మూడు ఫార్మాట్లు ఇవే. అయితే ఇటీవల కొత్తగా టీ10, 100 లీగ్స్ వచ్చేశాయి. వీటి తగ్గట్టుగా బ్యాటర్లు కూడా తమ టెక్నిక్‌కు పదునుపెట్టారు. తద్వారా వేగంగా బ్యాట్‌ను ఝులిపిస్తున్నారు. మరికొంత మంది ప్లేయర్స్ మాత్రం తమ ఇన్నింగ్స్‌లను నెమ్మదిగా ఆడేస్తుంటారు. ఇక మ్యాచ్ ఏదైనా కూడా చివరి వరకు అజేయంగా బరిలో నిలదొక్కుకునే బ్యాటర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలాంటి వాళ్లు మాత్రమే తమ జట్టుకు అత్యధిక స్కోర్లు అందించడంలో, లక్ష్యాలను చేధించడంలో సహాయపడుతుంటారు. మరి వన్డేల్లో ఎక్కువ మ్యాచ్‌లు అజేయంగా నిలిచిన బ్యాటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎం.ఎస్.ధోని:

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక నాటౌట్‌ల విషయానికి వస్తే.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ముందు వరుసలో ఉంటాడు. అతడే ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ఫినిషర్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ధోని.. మొత్తం 350 మ్యాచ్‌ల్లో 50.57 సగటుతో 10773 పరుగులు చేశాడు. ఈ మాజీ కెప్టెన్ అత్యధిక 84 సార్లు నాటౌట్‌గా నిలచాడు. ఇక ధోని నాటౌట్‌ ఉన్నప్పుడు టీమిండియా కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే ఓడి, 47 సార్లు గెలిచింది.

షాన్ పొలాక్:

ఈ దక్షిణాఫ్రికా లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్.. ఎప్పుడూ కూడా ఇన్నింగ్స్ ఎండింగ్‌లో బ్యాటింగ్‌కు వస్తాడు. చేసేది తక్కువ పరుగులైనా కూడా జట్టుకు కావాల్సినప్పుడు తన వంతు సహాయాన్ని అందిస్తాడు. పొలాక్ తన వన్డే కెరీర్‌లో మొత్తంగా 3519 పరుగులు చేశాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. అలాగే, అతడు వన్డేల్లో 72 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు నాటౌట్‌‌గా నిలిచిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

చమిందర్ వ్యాస్:

ఈ శ్రీలంక పేసర్ తన వన్డే కెరీర్‌లో 322 మ్యాచ్‌లు ఆడాడు. దాదాపుగా 72 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఈ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ వన్డేల్లో 400 వికెట్లు తీయడంతో పాటు 2025 పరుగులు కూడా చేశాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో బెవాన్ నిలిచాడు.

మైఖేల్ బెవాన్:

ఎం.ఎస్. ధోని రాక ముందు.. వన్డేల్లో అత్యుత్తమ ఫినిషర్ మైఖేల్ బెవన్. ఈ ఆస్ట్రేలియా ఎడమచేతి వాటం ప్లేయర్ వన్డే కెరీర్‌లో మొత్తంగా 232 మ్యాచ్‌లు ఆడాడు. 53.58 సగటుతో ఆరు సెంచరీలు, 46 అర్ధ సెంచరీలతో 6912 పరుగులు చేశాడు. అంతేకాకుండా, బెవాన్ తన ODI కెరీర్‌లో 67 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.

ముత్తయ్య మురళీధరన్:

ఈ శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ తన 350 మ్యాచ్‌ల కెరీర్‌లో 63 సార్లు నాటౌట్‌గా నిలిచాడు . వన్డేల్లో 534 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా, వీళ్లు మాత్రమే కాదు, న్యూజిలాండ్ బ్యాటర్ క్రిస్ హారిస్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా, పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్, దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్, న్యూజిలాండ్ స్పిన్నర్ డేనియల్ విటోరీ ఈ లిస్టులో ఉన్నారు.