IPL 2022 Mega Auction: ఆ ‘రూట్’ లోనే స్టార్ క్రికెటర్లు.. ఐపీఎల్ మెగా వేలానికి దూరం కానున్న ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లు!..

| Edited By: Ravi Kiran

Jan 18, 2022 | 10:12 AM

ప్రపంచంలో అతిపెద్ద దేశవాళి క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈసారి కళ తప్పనుందా? స్టార్ ఆటగాళ్లు ఈ లీగ్ నుంచి తప్పుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఐపీఎల్ వర్గాలు

IPL 2022 Mega Auction:  ఆ రూట్ లోనే  స్టార్ క్రికెటర్లు.. ఐపీఎల్ మెగా వేలానికి దూరం కానున్న ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లు!..
Follow us on

ప్రపంచంలో అతిపెద్ద దేశవాళి క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈసారి కళ తప్పనుందా? స్టార్ ఆటగాళ్లు ఈ లీగ్ నుంచి తప్పుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఐపీఎల్ వర్గాలు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి నెల రోజుల కంటే తక్కువ సమయం ఉండడం..  ఆస్ట్రేలియా, ఇంగ్లండ్  జట్లలోని స్టార్ ఆటగాళ్లు ఈ లీగ్ నుంచి తప్పుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ ఐపీఎల్ మెగా వేళంలో పాల్గొంటానని ప్రకటన చేశాడు. అయితే యాషెస్ ఓటమితో మాట మార్చాడు.   మెగా వేలంలో పాల్గొననని తెలిపాడు. ఇప్పుడు రూట్ బాటలోనే  స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కూడా నడిచాడు. ఐపీఎల్ మెగా వేలం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.  ఇంగ్లండ్ జట్టుకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టోక్స్ తెలిపాడు.

వీరు కూడా అనుమానమే..

కాగా రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్రధాన ఆటగాడిగా ఉన్న బెన్ స్టోక్స్.. గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. దీనికి తోడు రాజస్థాన్ ఫ్రాంఛైజీ కూడా అతనిని రిటైన్ చేసుకోలేదు. ఇంగ్లండ్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్  కూడా ఐపీఎల్ 2022లో ఆడడం అనుమానమే.  రాజస్థాన్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న  అతను చాలా కాలంగా గాయాలతో సతమతమవుతున్నాడు. ఇక ఆస్ట్రేలియా టెస్ట్‌ కెప్టెన్‌ ప్యాట్ ట్‌ కమిన్స్‌, స్టార్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్‌లు   కూడా వేలంలో పాల్గొన‌డం లేదని తెలుస్తోంది.  కమిన్స్‌ గతేడాది కేకేఆర్‌ తరఫున ఆల్‌రౌండర్‌గా అద్భుతంగా రాణించాడు.  మిచెల్ స్టార్క్ విషయానికొస్తే… గత కొన్నేళ్లుగా ఐపీఎల్ టోర్నీకి దూరంగా ఉంటున్నాడు.  చివరిసారిగా 2015 సీజన్‌లో ఆడాడు.  ఆతర్వాత వ్యక్తిగత కారణాలతో ఈ లీగ్ నుంచి తప్పుకున్నాడు. అయితే ఈ ఏడాది మాత్రం కచ్చితంగా లీగ్ కు అందుబాటులో ఉం​టానని ముందుగా ప్ర‌క‌టించాడు. కానీ పరిస్థితులను చూస్తుంటే అతను కూడా తన నిర్ణయాన్ని మార్చుకోనున్నట్లు తెలుస్తుంది.  కాగా ఇంగ్లండ్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడకపోవడానికి ప్రధాన కారణం యాషెస్ సిరీస్ లో  ఆ జట్టు వైఫల్యమేనని తెలుస్తోంది. ఆటగాళ్ల ప్రదర్శనపై  ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గుర్రుగా ఉందని, అందుకే ఆటగాళ్లు ఐపీఎల్ ను పక్కన పెడుతున్నారని తెలుస్తోంది.

Also Read: Dhanush Divorce: సినిమా పరిశ్రమలో మరో బ్రేకప్‌.. భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన ధనుష్‌..

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. డీఏ బకాయిలు, పీఆర్సీల జీవోల విడుదల..

Budget2022: వ్యవసాయ రంగానికి గతేడాది బడ్జెట్ కేటాయింపు ఎంత? అప్పటి ప్రతిపాదనలు ఏమిటి? తెలుసుకుందాం..