ICC: ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌.. ఈసారి ఏకంగా ముగ్గురు భారత క్రికెటర్లు నామినేట్‌.. ఎవరంటే?

గాయంతో తప్పుకున్న రవీంద్ర జడేజా ప్లేస్‌లో టీమిండియాలోకి వచ్చిన అక్షర్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతను మొత్తం 8 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో ఇరు జట్ల అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఇతడే.

ICC: ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌.. ఈసారి ఏకంగా ముగ్గురు భారత క్రికెటర్లు నామినేట్‌.. ఎవరంటే?
Team India
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 06, 2022 | 11:02 AM

ఐసీసీ ప్రతి నెలా ప్రకటించే ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ పురస్కారానికి ఈసారి భారత్‌ నుంచి ముగ్గురు క్రికెటర్లు నామినేట్ అయ్యారు. సెప్టెంబరు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో పురుషుల విభాగంలో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ రేసులో నిలిచాడు. అతనితో పాటు పాకిస్థాన్‌ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్, ఆస్ట్రేలియా లేటెస్ట్‌ సెన్సేషన్‌ కామెరూన్ గ్రీన్‌ కూడా ఈ పురస్కారానికి నామినేట్ అయ్యాడు. కాగా గాయంతో తప్పుకున్న రవీంద్ర జడేజా ప్లేస్‌లో టీమిండియాలోకి వచ్చిన అక్షర్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతను మొత్తం 8 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో ఇరు జట్ల అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఇతడే. ఇక ఇదే సిరీస్‌లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు కామెరూన్ గ్రీన్ రెండు అర్ధశతకాలు బాది ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు రేసులో నిలిచాడు.

ఇక మహమ్మద్ రిజ్వాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత పది మ్యాచుల్లో ఏకంగా ఏడు అర్ధశతకాలు చేసి సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్‌లోనూ 281 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌‌గా నిలిచాడు. ఇక మహిళల విభాగంలో ఈ పురస్కారానికి మొత్తం ముగ్గురు నామినేట్‌ కాగా ఇద్దరు భారతీయులు ఉండడం విశేషం. వారే టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన. ఇంగ్లండ్‌ తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నిగర్ సుల్తానా ఈ అవార్డుకు నామినేట్‌ అయ్యింది. మరి ఈసారి వీరిలో ప్లేయర్ ఆఫ్‌ ది మంత్‌ పురస్కారం వరిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..