CSK: అస్సలు ఊహించరు.! ధోని ‘మాస్టర్ గేమ్’ ఇదే.. కెప్టెన్సీ వదులుకోవడానికి కారణం తెలుసా..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. నేటి నుంచి ఐపీఎల్ 2024 ప్రారంభమవుతోంది. టోర్నీలోని అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న రెండు జట్లు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడనున్నాయి. ఈ మ్యాచ్‌ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. మరి ఆ సంగతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

CSK: అస్సలు ఊహించరు.! ధోని మాస్టర్ గేమ్ ఇదే.. కెప్టెన్సీ వదులుకోవడానికి కారణం తెలుసా..
Ms Dhoni

Updated on: Mar 22, 2024 | 11:52 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. నేటి నుంచి ఐపీఎల్ 2024 ప్రారంభమవుతోంది. టోర్నీలోని అతి పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న రెండు జట్లు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడనున్నాయి. ఈ మ్యాచ్‌ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ మొదలయ్యే 24 గంటలు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక మార్పు జరిగింది. మహేంద్ర సింగ్ ధోని అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నైకి ఈ 17వ ఎడిషన్‌లో సారధ్యం వహించనున్నారు. ఇక ధోని తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాన్స్‌కు నిరుత్సాహం మిగల్చగా.. కానీ మహీ ‘మాస్టర్ స్ట్రోక్’ను కనిపెట్టిన వాళ్లు.. వావ్ అంటూ మిస్టర్ కూల్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ధోని కెప్టెన్సీని అందుకే వదిలాడా..?

అనూహ్యంగా.. అలాగే ఇంత అకస్మాత్తుగా ధోనీ కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి అసలు కారణం ఏంటి.? ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇక దీనికి సమాధానం ఐపీఎల్ 2024 ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కావచ్చునని కొందరి అంచనా. ప్లేయింగ్ ఎలెవన్ కాకుండా, IPL 2024లో ఒక ఆటగాడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఫీల్డింగ్ చేయవచ్చు అలాగే బ్యాటింగ్ లేదా బౌలింగ్ కూడా చేయవచ్చు. ఈ నిబంధనను దృష్టిలో పెట్టుకునే ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. గత కొన్నేళ్లుగా ధోని లోయర్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో ఆడేందుకు ఎక్కువ బంతులు మిగలవు. అలా కాకుండా ఈసారి ఆర్డర్‌లో కొంచెం పైకి ఎగబాకి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోని బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. చెన్నై జట్టు మొదట బ్యాటింగ్ చేస్తే ధోని లేకుండానే ప్లేయింగ్ ఎలెవన్‌ బరిలోకి దిగుతుంది. వికెట్లు వెనువెంటనే పడితే.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధోని బరిలోకి దిగొచ్చు. చెన్నై స్కోరును ఛేజ్ చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో ధోనీని ఉపయోగించుకోవచ్చు. అది కూడా మ్యాచ్, అలాగే అప్పటి పరిస్థితులను బట్టి.. ధోని తన స్థానాన్ని మార్చుకుంటుంటాడు. దీని బట్టి చూస్తే ధోని మాస్టర్ స్ట్రోక్‌కు ప్రత్యర్ధులు షాక్ అవ్వాల్సిందే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..