IND Vs ENG: టీమిండియా నుంచి ఆ ఇద్దరు ఔట్.. నాలుగో టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.!

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న 5 టెస్టుల సిరీస్‌ తుది అంకానికి చేరుకుంది. సిరీస్‌ డిసైడర్ ‌అయిన నాలుగో టెస్టు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి రాంచీ వేదికగా జరగనుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ ఒకటి, టీమిండియా రెండింటిలో విజయం సాధించింది.

IND Vs ENG: టీమిండియా నుంచి ఆ ఇద్దరు ఔట్.. నాలుగో టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.!
India Vs England

Updated on: Feb 21, 2024 | 1:51 PM

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న 5 టెస్టుల సిరీస్‌ తుది అంకానికి చేరుకుంది. సిరీస్‌ డిసైడర్ ‌అయిన నాలుగో టెస్టు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి రాంచీ వేదికగా జరగనుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ ఒకటి, టీమిండియా రెండింటిలో విజయం సాధించింది. ఇప్పటికి భారత్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. 4వ టెస్టుకు టీమిండియాకు చెందిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ఆ కీలక ప్లేయర్స్ కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా. తొలి మూడు టెస్టులు ఆడిన జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చేందుకు.. నాలుగో టెస్టుకు అతడ్ని దూరంగా పెట్టింది టీమ్ మేనేజ్‌మెంట్. ఇక తొలి మ్యాచ్‌లో ఆడిన కేఎల్ రాహుల్.. కండరాల నొప్పి కారణంగా మరో రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు అతడు పూర్తిగా ఫిట్‌నెస్ సాధించకపోవడంతో 4వ మ్యాచ్‌కు అందుబాటులో లేడు.

అలాగే మరో పేసర్ ముకేష్ కుమార్‌ను కూడా టీమిండియా మేనేజ్‌మెంట్ జట్టు నుంచి విడుదల చేసినట్టు తెలుస్తోంది. దీంతో పేస్ బాధ్యత మొత్తానికి మహమ్మద్ సిరాజ్‌పై పడే అవకాశం ఉంది. గత 2 మ్యాచ్‌ల్లో ఆడిన రజత్ పటిదార్ పూర్తిగా విఫలమయ్యాడు. మొత్తం 4 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన పటిదార్ కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. కాబట్టి 4వ టెస్టు మ్యాచ్‌లో అతడిని తప్పించే అవకాశం ఉంది. పటిదార్ స్థానంలో అక్షర్ పటేల్ లేదా దేవదత్ పడిక్కల్‌ రంగంలోకి దిగవచ్చు. బుమ్రా, రాహుల్.. అలాగే ముకేష్ కుమార్ మినహా.. మిగిలిన ప్లేయర్స్ ఎవ్వరూ మారే ఛాన్స్‌లు కనిపించట్లేదు.

భారత టెస్టు జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశ్వసి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), కేఎస్ భరత్(వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, దేవదత్ పడిక్కల్. జస్ప్రీత్ బుమ్రా(4వ మ్యాచ్‌కు అందుబాటులో లేడు).