Virat Kohli: కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే కెప్టెన్ ఆ యువ ఆటగాడే.. మనసులో మాట బయటపెట్టిన యువీ..
Indian Cricket Team : ఇప్పటికే టీమిండియా టీ-20, వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి దూరమైన విరాట్ కోహ్లీ తాజాగా టెస్ట్ కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు.
Indian Cricket Team : ఇప్పటికే టీమిండియా టీ-20, వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి దూరమైన విరాట్ కోహ్లీ తాజాగా టెస్ట్ కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు. దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ టెస్టులో ఓటమి తర్వాత టెస్ట్ జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. దీంతో అతని అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. టీ 20 వరల్డ్ కప్ కుముందు మూడు ఫార్మాట్లకు నాయకత్వం వహించిన విరాట్ ఇప్పుడు ఓ సాధారణ బ్యాటర్ గా మాత్రమే జట్టులో కొనసాగనున్నాడు. కాగా కోహ్లీ హఠాత్తుగా తప్పుకోవడంతో ఇప్పుడు అతని స్థానంలో తదుపరి కెప్టెన్ ఎవరనే విషయంపై చర్చ మొదలైంది. ఇప్పటికే టీ20, పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకే టెస్టు పగ్గాలు కూడా అప్పగించే అవకాశాలు ఉన్నాయని చాలా మంది భావిస్తున్నారు. అయితే వయసు, ఫిట్‌నెస్ పరంగా గాయాలతో సతమతమవుతున్న రోహిత్ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపకపోవచ్చని కొందరు క్రీడా విశ్లేషకుల అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరికొందరి పేర్లు తెరపైకి వస్తున్నాయి.
అతనే కోహ్లీ వారసుడు..
దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయం ప్రకారం కోహ్లి వారసుడిగా రిషభ్ పంత్ అయితే బాగుంటుందంటున్నాడు. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఈ యంగ్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ కే ఓటు వేశాడు. రిషబ్ కు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించే విషయమై ట్విట్టర్ లో గవాస్కర్ చేసిన కామెంట్ కు యువీ స్పందించాడు. ‘అబ్‌సొల్యుట్లీ! హి రీడ్స్ ద గేమ్ వెల్ బిహైండ్ ద స్టంప్స్’ అంటూ వికెట్ల వెనక ఉంటూ అతను ఆటను బాగా అధ్యయనం చేస్తాడని, టీమిండియాను మెరుగ్గా ముందుకు నడిపిస్తడని పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో జరిగిన ఆఖరు టెస్టులో అందరూ చేతులెత్తేయగా పంత్ సెంచరీతో కదం తొక్కాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలోనూ మెరుపు ఇన్సింగ్స్ లు ఆడి టీమిండియాకు టెస్ట్ సిరీస్ విజయం అందించాడు.
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్‌లో) ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు రిషభ్ పంత్. శ్రేయస్ అయ్యర్ స్థానంలో 2021 సీజన్ సారథ్య బాధ్యతలను చేపట్టిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన జట్టును పాయింట్ల పట్టికలో ఢిల్లీని అగ్రస్థానానికి తీసుకెళ్లాడు. అయితే నాకౌట్ మ్యాచ్ ల్లో వరుస పరాజయాలు పొంది ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Also Read: Multibagger Stocks: 5 రోజుల్లో 90 శాతం రాబడి.. మార్కెట్ నష్టాల్లో ఉన్నా లాభాలు కురిపించిన షేర్లు..!
Goa Assembly Election: ఫలితాలు అలా వస్తే.. గోవాలో పొత్తులపై ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సంచల ఎత్తులు..