Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మంగళవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసియా కప్-2023 ఆతిథ్య పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌ను శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ తిరస్కరించాయి. ఇటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించవచ్చవని తెలుస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్‌లో ఆసియా కప్ జరగకపోతే, టోర్నమెంట్‌లో ఆడబోమని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ పాకిస్థాన్ ఆడకపోతే నష్టపోయే అవకాశం భారీగా ఉంటుంది.
పాకిస్థాన్‌కు ఆర్థికంగా నష్టం కలిగి ఛాన్స్ ఉంది. ఆసియా కప్‌ను నిర్వహించడం ద్వారా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోట్లాది రూపాయలను ఆర్జించి ఉండేది. ఇప్పుడు ఆతిథ్యమివ్వకపోవడం వల్ల పీసీబీ కోట్లు సంపాదించే అవకాశాన్ని కోల్పోతుంది.
ఈ ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్ ఉంది. అంతకు ముందు ఈ ఆసియా కప్ ఆడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ టోర్నీలో ఆడడం ద్వారా పాకిస్థాన్ జట్టు వన్డే ప్రపంచకప్‌కు సిద్ధమయ్యే అవకాశం ఉంది. భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ ప్రపంచ కప్‌లో ఆడనున్నాయి. ఆసియా కప్‌లో ఈ జట్లతో ఆడడం వల్ల పాకిస్తాన్ తన బలాలు, బలహీనతలను తెలుసుకునే వీలుంది.
పాక్ వేదికగా జరిగే ఆసియాకప్‌లో టీమిండియా ఆడకపోతే వన్డే ప్రపంచకప్ కోసం తమ జట్టును కూడా భారత్‌కు పంపబోమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. పీసీబీ ఇలా చేస్తే అది పాకిస్తాన్‌కు కూడా నష్టమే ఎందుకంటే ఐసీసీ పాకిస్తాన్‌పై చర్య తీసుకోవచ్చు.
పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ను చాలా కష్టాలతో పునరుద్ధరించారు. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే, ఈ హోస్టింగ్ విషయంలో సంక్షోభం ఏర్పడవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా పాకిస్తాన్‌కు వెళ్లకూడదనే వైఖరిని భారత్ తీసుకోవచ్చు. ఈ సందర్భంలో పాకిస్తాన్ ఏమి చేస్తుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..