ICC Revenue Share: బీసీసీఐ ఖజానాలో కురవనున్న కోట్ల వర్షం.. ఐసీసీ రెవెన్యూ షేర్‌లో పాకిస్తాన్ వాటా ఎంతంటే?

International Cricket Council: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నుంచి ఆదాయ వాటాలో 72 శాతం పెరుగుదలను పొందింది. గురువారం డర్బన్‌లో జరిగిన వార్షిక సమావేశంలో సభ్య సంస్థలకు ఆదాయ పంపిణీని ICC ఆమోదించింది.

ICC Revenue Share: బీసీసీఐ ఖజానాలో కురవనున్న కోట్ల వర్షం.. ఐసీసీ రెవెన్యూ షేర్‌లో పాకిస్తాన్ వాటా ఎంతంటే?
Bcci

Updated on: Jul 14, 2023 | 5:41 PM

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నుంచి ఆదాయ వాటాలో 72 శాతం పెరుగుదలను పొందింది. గురువారం డర్బన్‌లో జరిగిన వార్షిక సమావేశంలో సభ్య సంస్థలకు ఆదాయ పంపిణీని ICC ఆమోదించింది. ఐసీసీ వార్షిక ఆదాయంలో దాదాపు 38.5 శాతం బీసీసీఐ పొందాలని నిర్ణయించారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇది అత్యధికంగా నిలిచింది.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇటీవల చర్చించి సవరించిన ఆదాయ-భాగస్వామ్య నమూనాను ఆమోదించింది. దీని ప్రకారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఐసీసీ వార్షిక నికర ఆదాయంలో 38.5% వచ్చే నాలుగు సంవత్సరాలలో, అంటే దాదాపు 39 శాతం వరకు సంపాదిస్తుంది. BCCI 2024 నుంచి 2027 వరకు సంవత్సరానికి US$230 మిలియన్లు(రూ.1886 కోట్లు) ఆర్జించనుంది.

డర్బన్‌లో కొత్త డెలివరీ మోడల్‌ను ఆమోదించిన ఐసీసీ..

ESPNCricinfo ప్రకారం, ICCలోని ఇతర 11 పూర్తి సభ్య దేశాలలో ఎవరూ బోర్డు వార్షిక నికర ఆదాయంలో రెండంకెల వాటాను పొందలేకపోవడం గమనార్హం.

పీసీబీ వాటా ఎంత?

మరోవైపు, BCCI తర్వాత ICC కొత్త మోడల్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న దేశాలుగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB), క్రికెట్ ఆస్ట్రేలియా (CA), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఉన్నాయి. డ్రాఫ్ట్ ICC పంపిణీ నమూనా ప్రకారం, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా వరుసగా US$41.33 మిలియన్లు (రూ. 340 కోట్లు) మరియు US$37.33 మిలియన్లు (రూ. 300కోట్లు) సంపాదిస్తాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు $30 మిలియన్లకు(రూ. 250 కోట్లు) పైగా సంపాదిస్తున్నట్లు అంచనా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..