Virat Kohli Workout: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తాడనడంలో సందేహం లేదు. అయితే తాజాగా విరాట్ వర్కౌట్ వీడియో ఒకటి పంచుకోవడంతో నెట్టింట్లో సందడి చేస్తోంది. 12 న లార్డ్స్‌లో ప్రారంభం కానున్న ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండవ టెస్టుకు ముందు, కెప్టెన్ విరాట్ కోహ్లీ వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కామెంట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నల్లటి షార్ట్, ఎల్లో టీ షర్టు ధరించిన విరాట్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను విరాట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో స్లో మోషన్‌లో ఉండడంతో మరింతగా ఆకట్టుకుంటోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న రషీద్ ఖాన్ కొన్ని ఎమోజీలతో వీడియోపై కామెంట్ చేశాడు. నావింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన మొదటి టెస్టు , వర్షం కారణంగా ఐదవ రోజు ఆదివారం ఆట నిలిచిపోవడంతో.. డ్రాగా ముగిసింది. 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్, 5 వ మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వచ్చేందుకు చివరి రోజు 157 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, 4 వ రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 52/1తో మంచి స్థితిలో ఉంది. రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కానీ ఐదవ రోజు వర్షంతో ఆట నిలిచిపోవడంతో మ్యాచ్ కాస్త డ్రాగా ముగిసింది.
“ఐదవ రోజు ఆట వర్షంతో ఆగిపోవడం సిగ్గుచేటు. మ్యాచ్‌లో మేం మంచి స్థితిలో నిలిచాం. తొలి టెస్టు రెండు, మూడు రోజుల్లో అడ్డుపడిన వర్షంతో కొది ఓవర్లైనా జరిగింది. కానీ, చివరి రోజు మాత్రం ఒక్క బంతి పడకుండానే నిలిచిపోయింది” అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. అలాగే ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ కూడా మాట్లాడుతూ, “మేము ఖచ్చితంగా గెలవగలమని విశ్వసించాం. బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుతంగా రాణిస్తే గెలుపు మాదే”అని పేర్కొన్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో రెండోవ టెస్టు ఆగస్టు 12న గురువారం నుంచి లార్డ్స్‌లో జరగనుంది.
Also Read: 10 బంతుల్లో 42 పరుగులు.. రోహిత్ శర్మకు ధీటుగా తుఫాన్ ఇన్నింగ్స్.. ఈ ముంబై ప్లేయర్ ఎవరంటే?
Cricket In Olympics: క్రికెట్ అభిమానులకు పండగే.. ఇకపై ఒలింపిక్స్‌లో జెంటిల్ మెన్ గేమ్.