India vs Australia: చరిత్ర సృష్టించిన భారత జట్టు.. వన్డే చరిత్రలో ఆస్ట్రేలియాపై భారీ స్కోర్..

|

Sep 25, 2023 | 4:45 AM

Team India ODI History: చివరి 15 ఓవర్లలో కేఎల్ రాహుల్ 38 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 52 పరుగులు చేసి ఔట్ కాగా, మరోవైపు తుఫాన్ బ్యాటింగ్ ప్రారంభించిన సూర్యకుమార్ యాదవ్ కేవలం 37 బంతుల్లోనే 6 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో అజేయంగా 72 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా స్కోరు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. రెండో వన్డేలో 99 పరుగులతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ ఉండగానే వన్డే సిరీస్‌ను గెలుచుకుంది.

India vs Australia: చరిత్ర సృష్టించిన భారత జట్టు.. వన్డే చరిత్రలో ఆస్ట్రేలియాపై భారీ స్కోర్..
India Vs Australia 2nd Odi
Follow us on

India vs Australia: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 2వ వన్డే మ్యాచ్‌లో టీమిండియా అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించింది. రెండో వన్డేలో 99 పరుగులతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ ఉండగానే వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే శుభ్ మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రుతురాజ్ గైక్వాడ్ 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

అనంతరం శుభ్‌మన్ గిల్‌తో కలిసి శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియా బౌలర్లను చీల్చి చెండాడారు. ఈ జోడీ అద్భుతమైన భాగస్వామ్యాన్ని ప్రదర్శించి ఆసీస్ బౌలర్లను చిత్తు చేసింది. ఫలితంగా 25 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 187 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత మెరుపులు కొనసాగించిన శ్రేయాస్ అయ్యర్ 86 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అయితే, సెంచరీ తర్వాత అంటే 90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 పరుగులతో ఇన్నింగ్స్ ముగించాడు. అయ్యర్ ఔట్ అయ్యాక శుభ్‌మన్ గిల్ 92 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అలాగే 97 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్లతో 104 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కాగా, టీమిండియా స్కోరు 35 ఓవర్లలో 243 పరుగుల వద్ద నిలిచింది.

చివరి 15 ఓవర్లలో కేఎల్ రాహుల్ 38 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 52 పరుగులు చేసి ఔట్ కాగా, మరోవైపు తుఫాన్ బ్యాటింగ్ ప్రారంభించిన సూర్యకుమార్ యాదవ్ కేవలం 37 బంతుల్లోనే 6 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో అజేయంగా 72 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా స్కోరు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.

రికార్డు స్కోర్..

వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా చేసిన అత్యధిక స్కోరు ఇదే. 2013లో బెంగుళూరులో జరిగిన మ్యాచ్‌లో 383 పరుగులు చేయడం ఇప్పటి వరకు రికార్డుగా నిలిచింది. ఇప్పుడు టీమ్ ఇండియా 399 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోరు చేసిన ప్రపంచ రికార్డు ఇంగ్లండ్ జట్టు పేరిట ఉంది. 2018లో ఆసీస్‌పై 6 వికెట్ల నష్టానికి 481 పరుగులు చేసి రికార్డ్ నెలకొల్పింది.

ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక స్కోర్లు..

481/6 – ఇంగ్లాండ్, నాటింగ్‌హామ్‌షైర్, 2018

438/9 – దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్, 2006

416/5 – దక్షిణాఫ్రికా, సెంచూరియన్, 2023

399/5 – భారత్, ఇండోర్, 2023

383/6 – భారత్, బెంగళూరు, 2013

ఇరుజట్లు..

భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసీద్ధ్ కృష్ణ.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, షాన్ అబాట్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..