Team India: కెప్టెన్‌గా సంజూ శాంసన్.. బీసీసీఐ కీలక ప్రకటన.. కొత్త బాధ్యతలు ఎప్పటినుంచంటే?

|

Sep 16, 2022 | 4:39 PM

IND A vs NZ A: సంజూ శాంసన్ ఇటీవల T20 ప్రపంచ కప్‌నకు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దీనికి శాంసన్ అభిమానులు BCCIపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ, విమర్శలు గుప్పించారు.

Team India: కెప్టెన్‌గా సంజూ శాంసన్.. బీసీసీఐ కీలక ప్రకటన.. కొత్త బాధ్యతలు ఎప్పటినుంచంటే?
Sanju Samson
Follow us on

టీ20 ప్రపంచకప్‌ 2022 కు భారత క్రికెట్ జట్టును ప్రకటించినప్పటి నుంచి బీసీసీఐ వార్తల్లో నిలుస్తోంది. ఇందులో చాలా మంది ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడంతో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌ను మరోసారి పట్టించుకోకపోవడంతో ఆయన అభిమానులు కలత చెందుతున్నారు. అయితే, శాంసన్‌కు ప్రపంచ కప్‌నకు మరో అవకాశం లభించకపోవచ్చు. కానీ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు శాంసన్‌పై విశ్వాసం వ్యక్తం చేసి ఈ ప్లేయర్‌ను ఇండియా ఏ జట్టుకు కెప్టెన్‌గా చేసింది. న్యూజిలాండ్ ఏతో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు శాంసన్ త్వరలో జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై కూడా అభిమానులు ఫైర్ అవుతున్నారు. మరోవైపు, బీసీసీఐపై వస్తున్న విమర్శలకు చరెక్ పెట్టేందుకు ఇలా చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇండియా A స్క్వాడ్..

భారత్ A: సంజు శాంసన్ (కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, రీతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, రజత్ పటీదార్, కేఎస్ భరత్ (WK), కుల్దీప్ యాదవ్, షాబాజ్ అహ్మద్, రాహుల్ చాహర్, తిలక్ వర్మ, కుల్దీప్ సేన్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్ , నవదీప్ సైనీ, రాజాంగద్ బావా.