AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ 2nd Test: పుణె టెస్టుకు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఫిట్‌గా మారిన స్టార్ ప్లేయర్..

Rishabh Pant Fitness: బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రిషబ్ పంత్ కీపింగ్ చేస్తూ గాయపడ్డాడు. రవీంద్ర జడేజా వేసిన బంతి అతని మోకాలికి తాకడంతో కీపింగ్ చేయలేకపోయాడు. అయితే, పుణెలో జరగనున్న రెండో టెస్ట్‌ ఆడడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇదే విషయమై ఇప్పుడు టీమిండియాకు కీలక వార్త వచ్చింది.

IND vs NZ 2nd Test: పుణె టెస్టుకు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఫిట్‌గా మారిన స్టార్ ప్లేయర్..
Team India vs New Zealand
Venkata Chari
|

Updated on: Oct 22, 2024 | 8:05 AM

Share

Rishabh Pant Fitness: న్యూజిలాండ్‌తో పుణె టెస్టుకు ముందు భారత క్రికెట్ జట్టుకు శుభవార్త అందింది. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ రెండో టెస్టులో ఆడేందుకు ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించారు. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో కీపింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. రవీంద్ర జడేజా వేసిన బంతి అతని మోకాలికి తాకడంతో కీపింగ్ చేయలేకపోయాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 99 పరుగులు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్‌తో అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా, భారత్ ఎదురుదాడికి దిగింది. అయితే, ఈ సమయంలో పంత్ చాలాసార్లు తడబడ్డాడు.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తల ప్రకారం, పంత్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆడటానికి వచ్చాడు. ఆ తర్వాత కూడా అతను నొప్పితో బాధపడ్డాడు. అయితే, అతను ఇప్పుడు కోలుకుని ఫిట్‌గా ఉన్నాడు. అక్టోబరు 24 నుంచి పుణెలో జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉన్నాడు.

పంత్‌కు శస్త్రచికిత్స చేసిన అదే కాలుకు గాయం..

డిసెంబరు 2022లో జరిగిన కారు ప్రమాదం తర్వాత పంత్‌కు అదే మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. పంత్ నిష్క్రమణతో ధ్రువ్ జురెల్ బెంగళూరు టెస్ట్‌లో కీపర్ గ్లౌజ్‌లు ధరించి, కీపింగ్ చేశాడు. బెంగళూరు టెస్టులో ఓడిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ పంత్ గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు. టీమ్ మేనేజ్‌మెంట్ తన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చాడు.

రోహిత్‌ మాట్లాడుతూ- మేం పంత్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉన్నాం. తన కాలికి ఆపరేషన్ జరిగింది. కాబట్టి, అతను పరిస్థితి ఏంటో మాకు తెలుసు. అతనికి మోకాలికి శస్త్రచికిత్సలు జరిగాయి. నిజం చెప్పాలంటే గత ఏడాదిన్నర కాలంలో చాలా బాధను అనుభవించాడు. కాబట్టి, ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటాం. అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డాడు. అతను కేవలం బంతిని కొట్టడానికి ప్రయత్నించాడు” అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..