Cricket: 5 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు.. 500 పైగానే రన్స్‌.. ఈ టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ వన్డేల్లోనూ తగ్గట్లేదుగా

| Edited By: Ravi Kiran

Aug 24, 2022 | 7:43 AM

Cheteshwar Pujara: భారత టెస్టు జట్టు కీలక ఆటగాడు చెతేశ్వర్ పుజారా ప్రస్తుతం వన్డేల్లో తన సత్తాను చాటుతున్నాడు. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న రాయల్ లండన్ కప్ వన్డే టోర్నీలో సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. ససెక్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతను..

Cricket: 5 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు.. 500 పైగానే రన్స్‌.. ఈ టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ వన్డేల్లోనూ తగ్గట్లేదుగా
Cheteshwar Pujara
Follow us on

Cheteshwar Pujara: భారత టెస్టు జట్టు కీలక ఆటగాడు చెతేశ్వర్ పుజారా ప్రస్తుతం వన్డేల్లో తన సత్తాను చాటుతున్నాడు. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న రాయల్ లండన్ కప్ వన్డే టోర్నీలో సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. ససెక్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతను తాజాగా మిడిల్‌సెక్స్‌పై మరో సెంచరీ చేశాడు. కేవలం 75 బంతుల్లోనే ఈ శతకం నమోదు చేయడం విశేషం. మ్యాచ్‌లో మొత్తం 90 బంతులు ఎదుర్కొన్న ఈ టెస్ట్‌ బ్యాటర్‌ 132 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 20 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడిన పుజారాకు ఇది ముచ్చటగా మూడో సెంచరీ కావడం విశేషం. ఆగస్టు 14న సర్రేపై 174 పరుగులు చేశాడు. అంతకుముందు ఆగస్టు 12న వార్విక్‌షైర్‌పై 107 పరుగులతో చెలరేగాడు. తద్వారా రాయల్‌ లండన్‌ వన్డే కప్‌-2022లో 500 పరుగుల మార్క్‌ను దాటిన రెండో బ్యాటర్‌గా పుజారా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్ టామ్ అస్లోప్‌తో కలిసి రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు పుజారా. బౌలర్లపై పోటాపోటీగా చెలరేగిన వీరిద్దరు నాలుగో వికెట్‌కు ఏకంగా 261 రన్స్‌ జోడించారు. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన ససెక్స్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 400 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ అస్లోప్‌ కూడా భారీ శతకం కొట్టేశాడు. 155 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్‌లతో ఏకంగా 189 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆపై భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన మిడిల్‌సెక్స్‌ ఏ దశలోనూ టార్గెట్‌ దిశగా సాగలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 243 పరుగులకే ఆలౌటైంది. దీంతో పుజారా టీం 157 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..