IND vs BAN: ఆసియా కప్-2023లో చివరి సూపర్-4 మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 266 పరుగులు టార్గెట్ నిలిచింది. వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడంలో భారత బౌలర్లు, ఫీల్డర్లు అందిపుచ్చుకోలేకపోయారు. బంగ్లాను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసే ఛాన్స్ మిస్ చేసుకున్నారు. కీలక బౌలర్లు లేకపోవడంతో, బౌలింగ్ బలహీనతలను ఉపయోగించుకుని బంగ్లాదేశ్ టీం 250 స్కోర్ దాటింది.
కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 80 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతను తన 55వ అర్ధ సెంచరీని సాధించగా, తౌహిద్ హృదయ్ తన ODI కెరీర్‌లో 5వ అర్ధ సెంచరీని సాధించాడు. 54 పరుగుల వద్ద తౌహీద్ ఔటయ్యాడు. భారత శిబిరంలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీకి 2 వికెట్లు దక్కాయి.
4వ స్థానంలో ఆడేందుకు వచ్చిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తన వన్డే కెరీర్‌లో 55వ అర్ధశతకం సాధించాడు. 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. షకీబ్ 85 బంతుల్లో 80 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. షకీబ్ 94.12 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.
తౌహీద్ హృదయ్ తన ODI కెరీర్‌లో 5వ అర్ధశతకం సాధించాడు. 54 పరుగులు చేసి ఔటయ్యాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో తిలక్ వర్మ అద్భుత క్యాచ్‌కు బలయ్యాడు. తౌహీద్ 81 బంతుల ఇన్నింగ్స్‌లో 66.67 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్(w), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటన్ దాస్ (వికెట్ కీపర్), తంజీద్ హసన్ తమీమ్, అన్ముల్ హక్, తౌహీద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, మెహిదీ హసన్ షేక్, నసుమ్ అహ్మద్, తంజీద్ హసన్ షకీబ్, ముష్తాఫిజుర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..