- Telugu News Sports News Cricket news Team india star women player smriti mandhana education qualification details check here
Smriti Mandhana: అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గేదేలే.. WPLలో ఖరీదైన భారత స్టార్ ప్లేయర్ మంధాన విద్యార్హతలేంటో తెలుసా?
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో స్మృతి మంధాన తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించింది. ఐసీసీ ఉమెన్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2016లో ఒకే ఒక్క భారత క్రీడాకారిణిగా మంధాన నిలిచింది.
Updated on: Feb 14, 2023 | 4:54 PM

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె భారత జట్టులో ఓపెనర్‌గా బ్యాటర్‌గా పేరుగాంచింది. బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతుంది. ఈ స్టార్ బ్యాటర్ ఎంత చదువుకుంది, ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..

స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన 1996లో జులై 18న జన్మించింది. ఆమె ముంబైలో మార్వాడీ కుటుంబంలో స్మిత, శ్రీనివాస్ మంధాన దంపతులకు జన్మించింది. ఆమెకు రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడు, ఆమె కుటుంబం మహారాష్ట్రలోని సాంగ్లీలోని మాధవనగర్‌కు మారింది.

స్మృతి మంధాన సాంగ్లీ నుంచి పాఠశాల విద్యను అభ్యసించింది. తన గ్రాడ్యుయేషన్ మహారాష్ట్రలోని సాంగ్లీలో పూర్తి చేసింది. స్మృతి చింతమన్‌రావు కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చదివారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం గురించి మాట్లాడితే, స్మృతి 13 ఆగస్టు 2014న ఇంగ్లాండ్‌తో తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది. అదే సమయంలో వన్డే అరంగేట్రం 10 ఏప్రిల్ 2013న బంగ్లాదేశ్‌పై జరిగింది. స్మృతి 5 ఏప్రిల్ 2013న బంగ్లాదేశ్‌తో తన మొదటి అంతర్జాతీయ టీ20 క్రికెట్ మ్యాచ్ కూడా ఆడింది.

2014లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు అరంగేట్రం మ్యాచ్‌లో స్మృతి జట్టును గెలిపించింది. కాగా, బలమైన ఆస్ట్రేలియాపై వన్డేల్లో తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించింది.

సోమవారం మహిళల ప్రీమియర్ లీగ్ కోసం ఆటగాళ్లను వేలం వేశారు. ఇందులో RCB జట్టు ఈ స్టార్ ప్లేయర్ కోసం రూ.3 కోట్ల 40 లక్షలపను ఖర్చు చేసింది.





























