‘ఆడే ఒక్క మ్యాచ్ కోసం ఇంత రచ్చ అవసరమా రోహిత్.. టీమిండియాలో నీకు ప్లేసే వేస్ట్..’

Rohit Sharma 2027 ODI World Cup: వన్డే ప్రపంచకప్‌కు ఏడాది సమయం ఉన్న వేళ రోహిత్ శర్మపై చర్చ మళ్లీ మొదలైంది. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన హిట్‌మ్యాన్ గణాంకాలు ఇప్పుడు మరో విషయాన్ని బయటపెడుతున్నాయి. సిరీస్ ఆరంభ మ్యాచ్‌లలో తడబడుతున్న ఆయన చివరి మ్యాచ్‌లో మాత్రం భారీ స్కోర్లు సాధిస్తున్న తీరు ఆసక్తి రేపుతోంది.

ఆడే ఒక్క మ్యాచ్ కోసం ఇంత రచ్చ అవసరమా రోహిత్.. టీమిండియాలో నీకు ప్లేసే వేస్ట్..
Rohit Sharma

Updated on: Sep 29, 2026 | 12:03 PM

Rohit Sharma 2027 ODI World Cup: భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే భవిష్యత్తుపై చర్చ మరోసారి వేడెక్కింది. 2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఏడాది సమయం ఉన్న సమయంలో ఆయన బ్యాటింగ్ తీరుపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓవైపు మాజీలు, మరోవైపు నెటిజన్లు ఆడే ఒక్క మ్యాచ్ కోసం ఇంత రచ్చ ఏంటి రోహిత్.. జైస్వాల్ కోసం నీ ప్లేస్ ఇస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రస్తుతం ఆయనకు మద్దతుగా ఉన్నప్పటికీ, ప్రతి మ్యాచ్‌లో రోహిత్ ప్రదర్శనపై ప్రత్యేక దృష్టి పడుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే ఇందుకు మరో ఉదాహరణగా మారింది. తిరువనంతపురంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 35 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 32 పరుగులు చేశాడు. ఆరంభంలో కొన్ని బౌండరీలతో దూకుడు చూపించినా, ఇన్నింగ్స్‌ను పెద్ద స్కోరుగా మలచలేకపోయాడు. ఈ ప్రదర్శనతో ఆయనపై సాగుతున్న చర్చ మరింత పెరిగింది. వచ్చే ప్రపంచకప్‌కు జట్టులో రోహిత్‌కు చోటు ఉంటుందా అనే ప్రశ్నకు గణాంకాలు కూడా కొత్త కోణాన్ని చూపిస్తున్నాయి.

2025 ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత రోహిత్ ఆడిన వన్డే సిరీస్‌లను పరిశీలిస్తే ఒక ప్రత్యేకమైన ధోరణి కనిపిస్తోంది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆయన బ్యాట్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపడం లేదు. క్రిక్బజ్‌ గణాంకాల ప్రకారం, ఈ కాలంలో తొలి రెండు మ్యాచ్‌లను కలిపి 11 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 335 పరుగులు చేశాడు. సగటు 30.4గా ఉంది. ఈ ఇన్నింగ్స్‌లలో రెండు అర్ధశతకాలు మాత్రమే ఉన్నాయి.

ఎక్కువమంది చదివినది: నా టార్గెట్ ఫిక్స్.. అందుకోసం అడ్డొచ్చినోళ్లను తొక్కి పడేసుడే.. విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇవి కూడా చదవండి

అదే సిరీస్‌లో చివరి మ్యాచ్‌ల విషయానికి వస్తే చిత్రం పూర్తిగా మారుతోంది. మూడో మ్యాచ్‌కు సంబంధించిన 5 ఇన్నింగ్స్‌లలో రోహిత్ ఏకంగా 424 పరుగులు చేశాడు. ఆయన సగటు 106గా నమోదైంది. ఇందులో రెండు శతకాలు, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. అంటే సిరీస్ చివరి మ్యాచ్‌లో రోహిత్ బ్యాట్ ఒక్కసారిగా వేగం పుంజుకుంటోంది.

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఇదే తరహా పరిణామం కనిపించింది. తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైన రోహిత్, చివరి వన్డేలో శతకం సాధించాడు. ఆ మ్యాచ్‌కు ముందు ఆయనను జట్టు నుంచి తప్పించవచ్చనే మీడియా కథనాలు వచ్చాయి. ఆ సమయంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా రోహిత్ జట్టులో కొనసాగుతారని స్పష్టం చేయాల్సి వచ్చింది.

ఎక్కువమంది చదివినది: టాస్ కూడా పడకుండానే ముగిసిన మ్యాచ్.. నేరుగా సెమీస్‌లోకి భారత్

ఇప్పుడు వెస్టిండీస్ సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనూ పెద్ద ఇన్నింగ్స్ రాకపోవడంతో పాత గణాంకాలు మళ్లీ చర్చకు వచ్చాయి. ప్రపంచకప్‌కు ఏడాది మాత్రమే ఉన్న వేళ, రోహిత్ తన తదుపరి వన్డేల్లో ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us