సర్ఫరాజ్‌పై నిఘా పెట్టిన రోహిత్.. టీమిండియాలో చేరకముందు నుంచే అంటూ షాక్.. ఎందుకో తెలుసా?

Rohit Sharma Key Comments on Sarfaraz Khan: రాజ్‌కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అరంగేట్రం టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించిన నాలుగో భారత ఆటగాడు సర్ఫరాజ్ నిలిచాడు. రాజ్‌కోట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అలాగే, ఈ ప్రదర్శన ఆధారంగా భారత జట్టులో చోటు ఖాయం చేసుకున్నట్లు అనిపిస్తోంది.

సర్ఫరాజ్‌పై నిఘా పెట్టిన రోహిత్.. టీమిండియాలో చేరకముందు నుంచే అంటూ షాక్.. ఎందుకో తెలుసా?
Sarfaraz Khan Rohit Sharma

Updated on: Feb 19, 2024 | 2:37 PM

Rohit Sharma Key Comments on Sarfaraz Khan: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేయడమే కాకుండా తన పేరును ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పాడు. రాజ్‌కోట్‌లో సర్ఫరాజ్‌ అద్భుత ప్రదర్శనతో డెబ్యూ మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించాడు. కానీ, రాజ్‌కోట్‌ను శాసించిన సర్ఫరాజ్ టీమ్ ఇండియాలో చేరడానికి ముందు సీక్రెట్‌గా ఎంక్వైరీకి గురయ్యాడంట. ఈ ముంబై ఆటగాడిపై గూఢచర్యం చేశారంట. సర్ఫరాజ్ విషయంలో ఇదంతా చేసింది మరెవరో కాదు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ విషయాన్ని రోహిత్ శర్మ కూడా బయటపెట్టాడు.

ఈ విషయాన్ని రోహిత్ శర్మ ఎప్పుడు బయటపెట్టాడనేది ఇప్పుడు ప్రశ్న. ఐతే రాజ్‌కోట్ టెస్టు తర్వాత విలేకరుల సమావేశంలో భారత కెప్టెన్ ఈ ప్రకటన చేశాడు. రోహిత్ చెప్పిన దాని ప్రకారం, గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో అలజడి సృష్టిస్తోన్న, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 70 సగటుతో పరుగులు చేస్తున్న బ్యాట్స్‌మన్ గురించి రోహిత్‌కు పెద్దగా తెలియదు. సర్ఫరాజ్ బ్యాటింగ్‌ను రోహిత్ చాలా తక్కువగా చూశాడు. ఎందుకంటే అది చూసి ఉంటే సర్ఫరాజ్ గురించి విచారణ చేయాల్సిన అవసరం ఉండేది కాదు.

సర్ఫరాజ్ గురించి విచారించిన రోహిత్ శర్మ?

రాజ్‌కోట్ టెస్టు ముగిసిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. సర్ఫరాజ్ బ్యాటింగ్‌ను తాను పెద్దగా చూడలేదని తెలిపాడు. అయితే ముంబైకి చెందిన కొందరు ఆటగాళ్ల నుంచి సర్ఫరాజ్‌పై ప్రశంసలు వచ్చాయి. క్లిష్ట పరిస్థితుల్లో పరుగులు చేయడంలో, భారీ స్కోర్లు చేయడంలో సర్ఫరాజ్ నిపుణుడని ప్రకటించాడు. అతనికి ఆడే స్వేచ్ఛ ఇస్తే, ఈ పనిని అతను మరింత ఈజీగా చేయగలడు అంటూ ప్రకటించాడు.

సర్ఫరాజ్ గురించి నేను విన్నాను – రోహిత్..

సర్ఫరాజ్ గురించి విన్నాను. అతని ఆట గురించి తెలుసుకున్న తర్వాత, అతని స్వభావం, శైలిని తెలుసుకోవడం ప్రారంభించాను అని రోహిత్ తెలిపాడు. అతని వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలిసి నేను ఆశ్చర్యపోయాను. నేను అనుకున్నట్లుగా, చూసినట్లుగా, విన్నట్లుగా, రాజ్‌కోట్ టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ సరిగ్గా అదే విధంగా కనిపించాడు. అతను పరుగుల కోసం అద్భుతమైన ఆకలిని కలిగి ఉండటమే కాకుండా నిలకడగా భారీ స్కోర్ చేయాలనుకునే బ్యాట్స్‌మెన్‌గా నాకు అనిపించాడు.

రోహిత్ నమ్మకాన్ని నిలబెట్టిన సర్ఫరాజ్..

రాజ్‌కోట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అరంగేట్రం టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించిన నాలుగో భారత ఆటగాడు సర్ఫరాజ్ నిలిచాడు. రాజ్‌కోట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అలాగే, ఈ ప్రదర్శన ఆధారంగా భారత జట్టులో చోటు ఖాయం చేసుకున్నట్లు అనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..