IND vs SA: గుడ్ న్యూస్.. రోహిత్, కోహ్లీ రీఎంట్రీ.. పాండ్యా ఔట్.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే?

Team India: ప్రస్తుతం మెడ నొప్పితో బాధపడుతున్న శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా ఉంది. ఒకవేళ గిల్ దూరమైతే, అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మ తిరిగి పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గాయంతో దూరమవడంతో రుతురాజ్ గైక్వాడ్‌కు జట్టులో చోటు దక్కవచ్చు.

IND vs SA: గుడ్ న్యూస్.. రోహిత్, కోహ్లీ రీఎంట్రీ.. పాండ్యా ఔట్.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే?
Rohit Sharma Virat Kohli

Updated on: Nov 20, 2025 | 1:58 PM

India vs South Africa: సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమవుతోంది. నవంబర్ 26న గౌహతిలో రెండో టెస్ట్ ముగియనుండగా, కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే అంటే నవంబర్ 30న రాంచీ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ త్వరలోనే భారత జట్టును ప్రకటించనుంది.

రోహిత్, కోహ్లీ రీఎంట్రీ..

ఈ సిరీస్ ద్వారా టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి వన్డే జట్టులోకి అడుగుపెట్టనున్నారు.

హార్దిక్ పాండ్యా దూరం..

ఆసియా కప్ సందర్భంగా గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. గాయం నుంచి కోలుకున్నప్పటికీ, నేరుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరపున ఆడి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోనున్నాడు.

ఇవి కూడా చదవండి

కెప్టెన్సీపై సందిగ్ధత..

ప్రస్తుతం మెడ నొప్పితో బాధపడుతున్న శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా ఉంది. ఒకవేళ గిల్ దూరమైతే, అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మ తిరిగి పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా గాయంతో దూరమవడంతో రుతురాజ్ గైక్వాడ్‌కు జట్టులో చోటు దక్కవచ్చు.

రాబోయే టీ20 సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ వన్డేల నుంచి విశ్రాంతినివ్వనున్నారు.

భారత జట్టు (అంచనా): పేసర్లుగా సిరాజ్, అర్ష్‌దీప్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ రేసులో ఉండగా.. స్పిన్నర్లుగా కుల్దీప్, వరుణ్ చక్రవర్తి కొనసాగే అవకాశం ఉంది. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్, బ్యాకప్‌గా రిషభ్ పంత్ ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.

అంచనా జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్/యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషభ్ పంత్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే/నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..