భారత జట్టు 2022 సంవత్సరాన్ని విజయంతో ముగించింది. మిర్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన టీమిండియా 2-0తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక భారత జట్టు 2023 సంవత్సరంలో ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే 2022 సంవత్సరంలో టీమిండియాకు మిశ్రమంగా నిలిచింది. భారత ఆటగాళ్లు ఎన్నో రికార్డులు సృష్టించారు. అయితే ICC ట్రోఫీ కోసం భారత జట్టు నిరీక్షణ అలాగే నిలిచింది.
భారత వెటరన్ ఆటగాడు విరాట్ కోహ్లి రెండు సెంచరీలు సాధించి ఈ ఏడాది తన కరువు తీర్చుకున్నాడు. అయితే 2022లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అతనే కాకపోవడం గమనార్హం. కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ఏడాది మరిచిపోలేని సంవత్సరం. అతను ఆసియా కప్‌లో లేదా టీ20 ప్రపంచకప్‌లో తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ ఏడాది టెస్టులు, వన్డేలు, టీ20ల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసింది ఎవరో ఇఫ్పుడు తెలుసుకుందాం..
టెస్ట్ క్రికెట్ గురించి మాట్లాడితే, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఈ ఏడాది భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రిషబ్ పంత్ 7 మ్యాచ్‌ల్లో 61.81 సగటుతో 680 పరుగులు చేశాడు. ఈ సమయంలో పంత్ బ్యాట్ నుంచి రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు వచ్చాయి. విరాట్ కోహ్లీ టాప్-5లో నిలవలేదు. ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో అతని పేరు మీద కేవలం 265 పరుగులు మాత్రమే నమోదయ్యాయి.
1. రిషబ్ పంత్ – 7 మ్యాచ్‌లు, 680 పరుగులు
2. శ్రేయాస్ అయ్యర్ – 5 మ్యాచ్‌లు, 422 పరుగులు
3. ఛెతేశ్వర్ పుజారా – 5 మ్యాచ్‌లు, 409 పరుగులు
4. రవీంద్ర జడేజా – 3 మ్యాచ్‌లు, 328 పరుగులు
5. రవిచంద్రన్ అశ్విన్ – 6 మ్యాచ్‌లు, 270 పరుగులు
వన్డే క్రికెట్‌లో శ్రేయాస్ అయ్యర్ దూకుడు మీదున్నాడు. ఈ ఏడాది 17 వన్డేల్లో 55.69 సగటుతో శ్రేయస్ ఒక సెంచరీ, 6 అర్ధ సెంచరీలతో సహా 724 పరుగులు చేశాడు. వన్డేల్లో టాప్-5 భారత బ్యాట్స్‌మెన్‌లలో కూడా కోహ్లీకి చోటు దక్కలేదు. ఈ ఏడాది వన్డేల్లో మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 302 పరుగులు చేశాడు.
1. శ్రేయాస్ అయ్యర్ – 17 మ్యాచ్‌లు, 724 పరుగులు
2. శిఖర్ ధావన్ – 22 మ్యాచ్‌లు, 688 పరుగులు
3. శుభ్‌మన్ గిల్ – 12 మ్యాచ్‌లు, 638 పరుగులు
4. ఇషాన్ కిషన్ – 8 మ్యాచ్‌లు, 417 పరుగులు
5. రిషబ్ పంత్ – 12 మ్యాచ్‌లు, 336 పరుగులు
ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. సూర్య 31 మ్యాచ్‌లలో 46.56 సగటుతో 1164 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ 20 మ్యాచ్‌ల్లో 781 పరుగులతో ఈ భారత జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
1. సూర్యకుమార్ యాదవ్ – 31 మ్యాచ్‌లు, 1164 పరుగులు
2. విరాట్ కోహ్లీ – 20 మ్యాచ్‌లు, 781 పరుగులు
3. రోహిత్ శర్మ – 29 మ్యాచ్‌లు, 656 పరుగులు
4. హార్దిక్ పాండ్యా – 27 మ్యాచ్‌లు, 607 పరుగులు
5. ఇషాన్ కిషన్ – 16 మ్యాచ్‌లు, 476 పరుగులు
ఈ ఏడాది మూడు ఫార్మాట్‌లను కలిపితే మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ 40 ఇన్నింగ్స్‌ల్లో 48.75 సగటుతో మొత్తం 1609 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో, రోహిత్ శర్మ ఐదో స్థానంలో నిలిచారు.
1. శ్రేయాస్ అయ్యర్ – 1609 పరుగులు
2. సూర్యకుమార్ యాదవ్ – 1424 పరుగులు
3. రిషబ్ పంత్ – 1380 పరుగులు
4. విరాట్ కోహ్లీ – 1348 పరుగులు
5. రోహిత్ శర్మ – 995
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..