Virat Kohli: సెంచరీతో విరాట్ కోహ్లీ ఊరమాస్ ఇన్నింగ్స్.. కట్‌చేస్తే.. టెస్ట్ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ..?

Virat Kohli Test Re-Entry: ఈ ఏడాది మే నెలలో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. చాలా మంది నిపుణులు, అభిమానులు కోహ్లీ రిటైర్ అయి ఉండకూడదని భావించారు. అయితే, టీమిండియా ఇటీవలి ఓటమి తర్వాత, అతను తన రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకోవాలనే డిమాండ్లు పెరగడం ప్రారంభించాయి.

Virat Kohli: సెంచరీతో విరాట్ కోహ్లీ ఊరమాస్ ఇన్నింగ్స్.. కట్‌చేస్తే.. టెస్ట్ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ..?
Virat Kohli Test Career

Updated on: Dec 01, 2025 | 8:15 AM

Virat Kohli: రాంచీ మైదానంలో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో తన ఫ్యాన్స్‌కు మరుపురాని క్షణాన్ని అందించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో విరాట్ 135 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లడానికి సహాయపడ్డాడు. ఈ సెంచరీ తన అభిమానులను సంతోషపెట్టినప్పటికీ, మ్యాచ్ తర్వాత అతను ఓ కీలక ప్రకటన చేశాడు. అది ఆ అభిమానులను కొంత బాధపెట్టింది. అన్ని ఊహాగానాలు, నివేదికల మధ్య, విరాట్ కోహ్లీ తాను ఒకే ఫార్మాట్‌లో ఆడతానని, టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశాడు.

భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే ఆదివారం, నవంబర్ 30న రాంచీలో జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక నెల తర్వాత మైదానంలోకి తిరిగి వచ్చాడు. తన తొలి మ్యాచ్‌లో అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 52వ సెంచరీ సాధించాడు. కోహ్లీ కేవలం 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో సహా 135 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ టీమిండియా 17 పరుగుల విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఇన్నింగ్స్‌కు కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నట్లు నివేదికలు..

యాదృచ్చికంగా, కోహ్లీ సెంచరీకి కొన్ని గంటల ముందు, ఇటీవల రిటైర్ అయిన అనుభవజ్ఞులు టెస్ట్ క్రికెట్‌లోకి తాత్కాలికంగా తిరిగి రావాలని బీసీసీఐ విజ్ఞప్తి చేయవచ్చని ఒక నివేదిక పేర్కొంది. విరాట్ కోహ్లీని సంప్రదించినట్లు స్పష్టమైన సూచనలు లేవని, కానీ ఒక మాజీ ఆటగాడు తిరిగి వచ్చే అవకాశం ఉందని క్రిక్‌బజ్ నివేదించింది. కోహ్లి లేదా రోహిత్ వంటి అనుభవజ్ఞులు తిరిగి వచ్చి టీం ఇండియా ఇబ్బందులను తీర్చగలరా అనే చర్చలతో రోజంతా సోషల్ మీడియా హోరెత్తింది.

క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..

రాంచీ వన్డే తర్వాత అవార్డు అందుకోవడానికి వచ్చిన విరాట్ కోహ్లీని ప్రెజెంటర్ హర్ష భోగ్లే ఈ విషయం గురించి అడిగాడు. “నువ్వు ఒకే ఫార్మాట్ క్రికెట్ ఆడుతున్నావు. అది ఎప్పుడూ ఇలాగే ఉంటుందా?” అని భోగ్లే అన్నాడు. దానికి సమాధానంగా, తాను వన్డే క్రికెట్ మాత్రమే ఆడతానని కోహ్లీ స్పష్టంగా చెప్పాడు. “ఇది ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. నేను ఒకే ఫార్మాట్ ఆడుతున్నాను” అని కోహ్లీ అన్నాడు. దీని అర్థం కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్న తర్వాత, దానిని వెనక్కి తీసుకోవడం గురించి కూడా ఆలోచించడం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..