Virat Kohli: అన్‌బాక్స్ చేయకుండానే ఫోన్ పోయింది.. మీలో ఎవరికైనా ఇలా జరిగిందా?: విరాట్ కోహ్లీ

Virat Kohli’s New Phone Missing: భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే 4 మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. ఇంతలో విరాట్ కోహ్లీ తన ఫోన్ పోగొట్టుకున్నాడనే సమాచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Virat Kohli: అన్‌బాక్స్ చేయకుండానే ఫోన్ పోయింది.. మీలో ఎవరికైనా ఇలా జరిగిందా?: విరాట్ కోహ్లీ
Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Feb 07, 2023 | 4:59 PM

భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభమయ్యే 4 మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. ఇంతలో విరాట్ కోహ్లీ తన ఫోన్ పోగొట్టుకున్నాడనే సమాచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సమాచారాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తన కొత్త ఫోన్ పోయిందని, ఇప్పటి వరకు అన్‌బాక్స్ చేయలేదని విరాట్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనిపై అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

విరాట్ కోహ్లి తన ట్వీట్‌లో, “అన్‌బాక్సింగ్‌కు ముందు మీ ఫోన్ దొంగిలించబడితే, అంతకు మించిన బాధ మరొకటి ఉండదు. ఇంతకు ముందు మీలో ఎవరికైనా ఇలా జరిగిందా?” కోహ్లీ చేసిన ఈ ట్వీట్‌కు సంబంధించి, సోషల్ మీడియాలో కొంతమంది వినియోగదారులు ఫోన్‌కు సంబంధించిన యాడ్‌గా పరిగణిస్తుండగా, మరికొందరు వినియోగదారులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ ట్వీట్‌పై జోమాటో కూడా ఫన్నీగా ట్వీట్ చేసింది.

విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కోసం నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. 2019 సంవత్సరం నుంచి ఈ ఫార్మాట్‌లో కోహ్లి ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో టెస్టు క్రికెట్‌లో అతని ఫామ్‌ను చూస్తుంటే.. కోహ్లీ బ్యాట్‌ నుంచి కచ్చితంగా భారీ ఇన్నింగ్స్‌ వస్తుందని అంతా భావిస్తున్నారు.

అభిమానుల కామెంట్స్..

ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు కోహ్లి స్వీప్, రివర్స్ స్వీప్ ప్రాక్టీస్..

విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో తన సెంచరీల కరువును 2022 సంవత్సరంలో ముగించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అద్భుతమైన ఫాంతో కనిపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో టెస్టులో కూడా దీన్ని కొనసాగించగలడని అంతా భావిస్తున్నారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్‌ను ఎటాంక్ చేసేందుకు కోహ్లీ నెట్స్‌లో స్వీప్, రివర్స్ స్వీప్ ఆడేందుకు కఠోర సాధన చేస్తున్నాడు.