Video: ‘లవర్ లేకుండా ఒంటరిగా వెళ్లావా..’ టీమిండియా క్రికెటర్ లవర్‌ని ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్.. ఎవరంటే?
Ishan Kishan Girlfriend Aditi Hundia Photos: ఇషాన్ కిషన్ టీమ్ ఇండియాలో పునరాగమనం చేయడానికి దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. అతను చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవల అతను బుచ్చిబాబు టోర్నమెంట్‌లో ఆడుతూ కనిపించాడు. ఇప్పుడు అతను సెప్టెంబర్ 5 నుంచి ఆడనున్న దులీప్ ట్రోఫీలో కనిపించనున్నాడు. ఇంతలో, ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను పంచుకున్నారు.
Ishan Kishan Girlfriend Aditi Hundia Photos: ఇషాన్ కిషన్ టీమ్ ఇండియాలో పునరాగమనం చేయడానికి దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. అతను చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవల అతను బుచ్చిబాబు టోర్నమెంట్‌లో ఆడుతూ కనిపించాడు. ఇప్పుడు అతను సెప్టెంబర్ 5 నుంచి ఆడనున్న దులీప్ ట్రోఫీలో కనిపించనున్నాడు. ఇంతలో, ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ అదితి హుండియా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను పంచుకున్నారు. ఇది అభిమానులలో చాలా చర్చనీయాంశమైంది. అదితి చేసిన ఈ పోస్ట్‌పై అభిమానులు ఇషాన్‌కి సంబంధించిన అనేక ప్రశ్నలు కూడా అడుగుతున్నారు.
ఇషాన్ కిషన్ లవర్ ఏమని పోస్ట్ చేసిందంటే..
ఇషాన్ కిషన్ స్నేహితురాలు అదితి హుండియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అందం, ఫిట్‌నెస్ విషయంలో అదితి బాలీవుడ్ హీరోయిన్ల కంటే తక్కువేమీ కాదు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలతో ఆమె దుబాయ్ టూర్‌లో ఉందని తెలుస్తోంది. అయితే, ఆమె ఒంటరిగా కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. ఒక అభిమాని, ‘ఒంటరిగా వెళ్లవా, ఇషాన్ కిషన్ ఎక్కడ ఉన్నాడు?’ అంటూ కామెంట్ చేయగా, ఆమె అందాన్ని పొగుడుతూనే మరో అభిమాని ‘వావ్ భౌజీ నీళ్లకు నిప్పు పెట్టావు’ అంటూ కామెంట్ చేశాడు.
అదితి హుండియా ఎవరు?
View this post on Instagram
మోడల్ అదితి హుండియా వృత్తిరీత్యా సోషల్ మీడియా క్వీన్. ప్రకటనలు, మ్యూజిక్ వీడియోలలో ఎక్కువగా కనిపిస్తుంది. అదితి 2017లో మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. ఇందులో, అదితి ఫైనల్స్ వరకు ప్రయాణించింది. ఆ తరువాత, మరుసటి సంవత్సరం అంటే 2018 లో, ఆమె మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుని వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో బాగా పాపులర్. అదితికి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఇషాన్, అదితి చాలా సందర్భాలలో కలిసి కనిపించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇషాన్‌తో కలిసి అదితి తీసుకున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇది కాకుండా, ఆమె ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో కూడా చాలాసార్లు గుర్తించారు. ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో ఇషాన్‌ను కొనుగోలు చేసినప్పుడు, అదితి దానితో సంతోషంగా ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభినందన పోస్ట్‌ను కూడా పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌లో అదితి ప్రౌడ్ అండ్ హ్యాపీ అంటూ రాసుకొచ్చింది. అప్పటి నుంచి వీరి వ్యవహారంపై చర్చ జోరందుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..