IND vs AUS: టీమిండియాకు గుడ్‌న్యూస్.. రంజీతో ఖతర్నాక్ రీఎంట్రీ.. ఆసీస్ పర్యటనకు సిద్ధమైన షమీ?

|

Nov 15, 2024 | 10:28 AM

Mohammed Shami: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఓ శుభవార్త వచ్చింది. ఈ పర్యటనలో టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భారత జట్టులో చేరవచ్చు అని తెలుస్తోంది. అతను ఇటీవల రంజీ ట్రోఫీలో తిరిగి మైదానంలోకి వచ్చాడు. రీఎంట్రీలో 4 వికెట్లు కూడా పడగొట్టడంతో ఊహాగానాలు మొదలయ్యాయి.

IND vs AUS: టీమిండియాకు గుడ్‌న్యూస్.. రంజీతో ఖతర్నాక్ రీఎంట్రీ.. ఆసీస్ పర్యటనకు సిద్ధమైన షమీ?
Mohammed Shami
Follow us on

Border Gavaskar Trophy: నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ కోసం టీమిండియా తొలి మ్యాచ్‌ జరగాల్సిన పెర్త్‌కు చేరుకుంది. ఈ పర్యటన కోసం భారత సెలక్టర్లు 18 మంది ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించారు. కానీ, అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఈ జట్టులో భాగం కాలేదు. గత సీజన్ నుంచి గాయంతో ఇబ్బంది పడుతున్న అతడు జట్టు ప్రకటించే వరకు ఫిట్‌గా లేడు. అయితే, ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగాడు. రంజీ ట్రోఫీ నుంచి తిరిగి మైదానంలోకి వచ్చాడు. మధ్యప్రదేశ్‌పై షమీ బాగా బౌలింగ్ చేశాడు. అందుకే, అతను ఆస్ట్రేలియా టూర్‌కు కూడా టీమిండియా తలుపు తట్టాడు.

టెస్టు సిరీస్ కోసం మహ్మద్ షమీ ఆస్ట్రేలియా వెళ్లనున్నాడట..!

ఒక సంవత్సరం తర్వాత తన మొదటి రెడ్ బాల్ మ్యాచ్ ఆడిన షమీ.. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు స్పెల్‌లు వేశాడు. ఈ సమయంలో అతను 19 ఓవర్లలో నాలుగు మెయిడిన్లతో నాలుగు వికెట్లు తీశాడు. ఇటువంటి పరిస్థితిలో సవాలుతో కూడిన ఆస్ట్రేలియా పర్యటనలో ఇబ్బంది పడనున్న భారత జట్టుకు మహ్మద్ షమీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి ముందు షమీకి రెండో ఇన్నింగ్స్‌లో పెద్ద పరీక్షే ఎదురవుతుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మ్యాచ్ జరిగిన తర్వాత సెలక్షన్ కమిటీ అతను రెండో ఇన్నింగ్స్‌లో ఎలా బౌలింగ్ చేస్తాడో గమనిస్తారంట. ఆ తర్వాత నొప్పి లేదా వాపు ఉందో లేదో గమనించి ఆసీస్ పర్యటనకు పంపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అన్ని ప్రమాణాలను పూర్తి చేస్తే డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌కు ముందే షమీ టీమ్ ఇండియాలో చేరడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఈ రంజీ ట్రోఫీ మ్యాచ్ నవంబర్ 16 న ముగుస్తుంది. నవంబర్ 22 నుంచి టీం ఇండియా తన మొదటి మ్యాచ్ ఆడనుంది. షమీ వెళితే, అతను ప్రైమ్ మినిస్టర్స్ 11తో రెండు రోజుల డే-నైట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతాడు. షమీ బౌలింగ్‌ను చూసేందుకు నేషనల్ సెలక్షన్ కమిటీ సభ్యుడు అజయ్‌తో పాటు ఎన్‌సీఏ మెడికల్ టీమ్ హెడ్ నితిన్ పటేల్ ప్రత్యేకంగా వచ్చారని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు పిటిఐకి తెలిపాయి. షమీపై తుది నిర్ణయం తీసుకునే ముందు, అతనికి సంబంధించిన అభిప్రాయాన్ని సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌లకు పంపనున్నారు.

ఇవి కూడా చదవండి

కీలక అప్‌డేట్ ఇచ్చిన బిసిసిఐ..

బీసీసీఐ నుంచి వినిపిస్తోన్న వార్తల మేరకు, ‘షమీ తన సహజమైన ఆట ఆడమని చెప్పారంట. ఎందుకంటే రంజీ ట్రోఫీ తదుపరి రౌండ్ టెస్ట్ సీజన్ ముగిసిన తర్వాత జనవరి 23 న ప్రారంభమవుతుంది. అందువల్ల సెలెక్టర్లు అతని ఫిట్‌నెస్‌ను తనిఖీ చేసేందుకు ఒకే ఒక మ్యాచ్‌ ఉంది. షమీ 19 ఓవర్లు బౌల్ చేశాడు. 57 ఓవర్లలో ఎక్కువ భాగం ఫీల్డింగ్ చేశాడు. అతను 90 డాట్ బాల్స్ కూడా వేశాడు. కానీ, అతను రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ బౌలింగ్, ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. అతను రెండో ఇన్నింగ్స్‌లో మరో 15 నుంచి 18 ఓవర్లు బౌలింగ్ చేస్తే.. అది మంచి నంబర్ అవుతుంది. అయితే నాలుగు రోజుల తర్వాత మళ్లీ ఏమైనా నొప్పి అనిపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. అతని ఫిట్‌నెస్‌కు ఎన్‌సీఏ వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, రెండో టెస్టుకు ముందే అతను జట్టులో చేరతాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..