IND vs WI: భారత జట్టును ప్రకటించిన వెంటనే గోల్డెన్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్.. రిటైర్మెంట్ ప్రకటించనున్న నయా వాల్?

|

Jun 24, 2023 | 7:33 AM

IND vs WI: వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు టీమిండియాను ప్రకటించారు. దీంతో భారత వెటరన్ ఆటగాడి గోల్డెన్ కెరీర్‌కు సెలక్టర్లు బ్రేక్ వేసినట్లైంది. దీంతో ఆ అనుభవజ్ఞుడు త్వరలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

IND vs WI: భారత జట్టును ప్రకటించిన వెంటనే గోల్డెన్ కెరీర్‌కు ఫుల్‌స్టాప్.. రిటైర్మెంట్ ప్రకటించనున్న నయా వాల్?
Pujara 1
Follow us on

Cheteshwar Pujara: భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జులై 12 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఓపెనర్ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) శుక్రవారం జట్టును ప్రకటించింది. వెస్టిండీస్‌తో తలపడే టెస్ట్ జట్టును ప్రకటించిన వెంటనే డాషింగ్ ప్లేయర్ కెరీర్ ముగింపు దశకు చేరుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

రోహిత్ కెప్టెన్, రహానే వైస్ కెప్టెన్..

వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరిగే 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చని తెలిసింది. కానీ, వన్డే ప్రపంచ కప్ 2023 ఉండడంతో బీసీసీఐ అతడిని కెప్టెన్‌గా కొనసాగించనుంది. ఈ సిరీస్ కొత్త ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ (WTC Cycle)కి కూడా నాంది పడనుంది. ఈ టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. అనుభవజ్ఞుడైన అజింక్యా రహానె జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రహానే ఇటీవల ఆస్ట్రేలియాతో ఆడిన డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final-2023)లో భాగమయ్యాడు.

పుజారా కెరీర్ ముగిసినట్లేనా..

భారత వెటరన్ బ్యాట్స్‌మెన్, టెస్ట్ స్పెషలిస్ట్ చెతేశ్వర్ పుజారాను బీసీసీఐ జట్టుకు దూరంగా ఉంచింది. అతను లండన్‌లో ఆడిన WTC ఫైనల్‌లో భాగమయ్యాడు. కానీ, భారతీయ అభిమానులను చాలా నిరాశపరిచాడు. పుజారా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. అతను ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 41 పరుగులు (27, 14) మాత్రమే చేయగలిగాడు. పుజారా త్వరలో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

2010లో ఎంట్రీ..

పుజారాను తప్పించి యశస్వి జైస్వాల్, రీతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం కల్పించింది. యశస్వి టెస్ట్ జట్టులో ఒక భాగం మాత్రమే. అయితే రీతురాజ్‌ను రెండు ఫార్మాట్‌ల కోసం టీమ్ ఇండియాలో చేర్చారు. 35 ఏళ్ల పుజారా తన కెరీర్‌లో ఇప్పటివరకు 103 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో మొత్తం 7195 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్ ద్వారా 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను 5 వన్డేల్లో 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

వెస్టిండీస్ సిరీస్ కోసం భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, రితురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (విసి), కెఎస్ భరత్ (వికె), ఇషాన్ కిషన్ (వికె), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..