Vinod Kambli Dances on Chak De India Song in Hospital: సరైన చికిత్స అందించడంతో ఇప్పుడు టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం కుదుటపడినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా థానేలోని ఆసుపత్రిలో చేరిన కాంబ్లీ క్రమంగా కోలుకుంటున్నాడు. ఇప్పుడు పాటల ట్యూన్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఈ మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో కాంబ్లి తన గదిలో ఆసుపత్రి సిబ్బందితో కలిసి డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నాడు. చక్ దే ఇండియా సాంగ్ పాడుతూ స్టెప్పులేయడం చూడొచ్చు.
వినోద్ కాంబ్లీ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో గత కొంతకాలంగా హెడ్‌లైన్స్‌లో ఉన్నాడు. చాలా మంది ఈ మాజీ క్రికెటర్‌కు సహాయాన్ని కూడా అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో థానేలోని లోఖండి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. స్వయంగా కాంబ్లీకి వీరాభిమాని అయిన హాస్పిటల్ ఇన్‌చార్జి కూడా భారత మాజీ స్టార్‌కి ఎటువంటి ఫీజులు లేకుండానే పూర్తి చికిత్స అందిస్తానని ప్రకటించాడు. అతనిని కోలుకునే వరకు చూసుకుంటానని హామీ ఇచ్చాడు.
కాంబ్లీ గత వారం రోజులుగా అదే ఆసుపత్రిలో ఉన్నాడు. ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నాడు. ఈ సమయంలో అతని విభిన్న వీడియోలు కూడా బయటపడ్డాయి. అతను ఆసుపత్రి సిబ్బంది సహాయంతో నడవడం కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆయన డ్యాన్స్ వీడియో బయటపడింది. ఇది ప్రతి అభిమానిని సంతోషపరుస్తుంది. ఇందులో షారుఖ్ ఖాన్ ఫేమస్ ఫిల్మ్ ‘చక్ దే ఇండియా’ టైటిల్ సాంగ్‌లో కాంబ్లీ ఆసుపత్రి మహిళా ఉద్యోగితో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. బిగ్గరగా పాట పాడుతూ, పాత రోజులను గుర్తు చేస్తూ బ్యాట్ లేకుండా షాట్లు కొడుతూ కనిపించాడు.
ఒకటిన్నర వారాల క్రితం కాంబ్లీ ఈ ఆసుపత్రిలో చేరాడు. కాంబ్లీకి మొదట్లో మూత్ర సంబంధిత సమస్యలపై ఫిర్యాదు చేశారని, అయితే ఆసుపత్రిలో చేరి పరీక్షలు నిర్వహించగా, కాంబ్లీ మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..