Virat Kohli: విమర్శకులకు తనదైన స్టైల్‌లో కౌంటరిచ్చిన విరాట్.. నెట్టింట రచ్చ చేస్తోన్న ఇన్‌స్టా ఫొటో..

|

Jul 16, 2022 | 4:53 PM

విరాట్ కోహ్లీ పేలవమైన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీంతో తాజాగా వారికి సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటోతో ధీటుగా సమాధానమిచ్చాడు.

Virat Kohli: విమర్శకులకు తనదైన స్టైల్‌లో కౌంటరిచ్చిన విరాట్.. నెట్టింట రచ్చ చేస్తోన్న ఇన్‌స్టా ఫొటో..
Virat Kohli Insta Photo
Follow us on

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat kohli) పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై మాజీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. గత కొన్ని మ్యాచ్‌ల్లో కోహ్లీ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా సెంచరీ కూడా చేయలేకపోయాడు. ముప్పేట దాడి చేస్తోన్న విమర్శకులకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా విరాట్ సమాధానమిచ్చాడు. ఈ మేరకు నెట్టింట్లో కోహ్లీ ఓ ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫొటోలో ఇంగ్లీషులో రాసిన లైన్ కూడా కనిపిస్తుంది. కోహ్లీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోను పంచుకున్నాడు. ఇందులో అతని బ్యాక్ గ్రౌండ్ లో రెక్కలు ఉన్న ఓ ఫొటోను చూడొచ్చు. అందులో ‘నేను పడితే ఏంటి. ఓహ్ నా ప్రియతమా, కానీ, నువ్వు ఎగిరితే ఎలా ఉంటది’ అంటూ అందులో ఉంది.

ఈ ఫొటోకు మాజీ క్రికెటర్ కోవిన్ పీటర్సన్ కోహ్లీని ప్రోత్సహిస్తూ మీరు చాలా దూరం వెళ్తారని కామెంట్ చేశాడు. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. మరోవైపు నెటిజన్లు మాత్రం, ఇది కచ్చితంగా విమర్శకులకు సరైన కౌంటర్ అంటూ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కలవరపెడుతోన్న కోహ్లి ఫామ్..

ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన T20I సిరీస్‌లో, కోహ్లీ చివరి రెండు మ్యాచ్‌లు ఆడాడు. కుడిచేతి వాటం బ్యాటర్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 12 కంటే ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు. అంతకుముందు, కోహ్లి ఇంగ్లండ్‌తో రీ షెడ్యూల్ చేసిన వన్-ఆఫ్ టెస్ట్‌లో భాగంగా జట్టులో ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో వరుసగా 11, 20 పరుగులు చేశాడు. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ 25 బంతుల్లో 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. గత మూడేళ్లుగా సెంచరీ లేకుండా, భారీ స్కోర్లు చేయలేక సతమతమవుతున్నాడు.

వెస్టిండీస్ సిరీస్ కోసం భారత వన్డే జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

వెస్టిండీస్ సిరీస్ కోసం భారత టీ20ఐ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణో కుమార్, రవి బిష్ణో కుమార్ , అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..