Navdeep Saini: లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ.. హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై కూర్చుని హల్‌చల్..

Navdeep Saini: టీమిండియా ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ.. సెలవులను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కరోనా వ్యాప్తి కారణంగా అన్నీ మ్యాచ్‌లు రద్దు...

Navdeep Saini: లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ.. హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై కూర్చుని హల్‌చల్..
Navdeep Saini

Updated on: Jun 01, 2021 | 12:08 AM

Navdeep Saini: టీమిండియా ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ.. సెలవులను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కరోనా వ్యాప్తి కారణంగా అన్నీ మ్యాచ్‌లు రద్దు అవడంతో టీమిండియా క్రికెటర్లందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. నవదీప్ సైనీ ఈ అవశాకాన్ని బాగా సద్వినియోగించుకుంటున్నాడు. తాజాగా సైనీ చొక్కా లేకుండా తన హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై కూర్చుని రేస్ పెంచుతున్నట్లు ఉన్న వీడియోను సైనీ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. దాంతో ఆ వీడియో కాస్తా తెగ వైరల్ అవుతోంది. పోస్ట్ చేసిన కాసేపటికే 760 లకు పైగా రీట్వీట్లు, 3 లక్షలకు పైగా వ్యూస్‌తో ఈ వీడియో వైరల్ అయ్యింది.ఈ వీడియోపై పలువురు అభిమానులు ఇంట్రస్టింగ్ కామెంట్స్ పెట్టారు.

28 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ గత రెండు ఏళ్లుగా టీమిండియా తరఫున ఆడుతున్నాడు. అద్భుతమైన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ సిరీస్‌ను భారత్ గెలుచుకోవడంలో నవదీప్ సైనీ పాత్ర కూడా ఎంతో కీలకం. ఇక బ్రిస్బేన్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు గాయపడినప్పటికీ.. గబ్బాలో బౌలింగ్ కొనసాగించి ఔరా అనిపించుకున్నాడు సైనీ. గాయపడినప్పటికీ సైనీ తన దేశం కోసం ఆడటం గ్రేట్ అని కొనియారు.

Navdeep Saini Twitter:


Also read:

Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు..