India vs England: టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా 1 టెస్ట్, 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. జులై 1 నుంచి భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య ఏకైక టెస్టు ప్రారంభం కానుంది. గతేడాది జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా ఈ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. గత సంవత్సరం, భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ చేరుకుంది. అయితే నాలుగు మ్యాచ్‌ల తర్వాత, కొంతమంది భారత ఆటగాళ్లు, కోచ్‌లకు కరోనా సోకింది. ఇలాంటి పరిస్థితుల్లో చివరి మ్యాచ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.
అఫ్రిదీ ప్లేస్‌పై కన్నేసిన రోహిత్..
ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత జులై 7 నుంచి జులై 17 వరకు మూడు మ్యాచ్‌ల టీ20, 3 వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్‌లో తలపడతారు. ఇంగ్లండ్ పర్యటనలో, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక ప్రత్యేక సందర్భంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని విడిచిపెట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్ల పరంగా అఫ్రిది ప్రస్తుతం రోహిత్ శర్మ కంటే ముందున్నాడు. ఈ పర్యటనలో అఫ్రిదిని రోహిత్ అధిగమించగలడు.
రోహిత్ సిక్సర్ల వర్షం..
అంతర్జాతీ క్రికెట్‌లో పాక్ దిగ్గజం షాహిద్ అఫ్రిది 476 సిక్సర్లు బాదాడు. కాగా, రోహిత్ శర్మ ఇప్పటివరకు 464 సిక్సర్లు కొట్టాడు. ఈ టూర్‌లో మరో 13 సిక్సర్లు బాదిన వెంటనే అఫ్రిది రికార్డ్‌ను రోహిత్ అధిగమించనున్నాడు. మొత్తం 553 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ పేరిట అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డు నమోదైంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు..
క్రిస్ గేల్ – 533 సిక్సర్లు
షాహిద్ అఫ్రిది – 476 సిక్సర్లు
రోహిత్ శర్మ – 476 సిక్సర్లు
బ్రెండన్ మెకల్లమ్ – 398 సిక్సర్లు
మార్టిన్ గప్టిల్ – 371 సిక్సర్లు
టెస్ట్ సిరీస్ షెడ్యూల్..
5వ టెస్టు: ఎడ్జ్‌బాస్టన్, జులై 1-5
టీ20 సిరీస్ షెడ్యూల్..
1వ టీ20: జులై 7, ఏజియాస్ బౌల్
2వ T20I: జులై 9, ఎడ్జ్‌బాస్టన్
3వ T20: జులై 10, ట్రెంట్ బ్రిడ్జ్
వన్డే సిరీస్ షెడ్యూల్..
1వ వన్డే: జులై 12, ది ఓవల్
2వ వన్డే: జులై 14, లార్డ్స్
3వ ODI: జులై 17, మాంచెస్టర్