టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనుకోకుండా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. భారత జాతీయ జెండాను అగౌరవపర్చాడంటూ కొందరు నెటిజన్లు హిట్ మ్యాన్ పై విమర్శలు చేస్తున్నారు. ఇలాంటిసున్నితమైన అంశాల పట్ల రోహిత్ శర్మ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బార్బడోస్‌లో గత నెలలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జాతీయ జెండాతో సంబరాలు చేసుకున్నాడు. ఈ వేడుకల మధ్య భారత జట్టు కెప్టెన్ కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని నాటేందుకు ప్రయత్నించాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ సమయంలో అనుకోకుండా జెండా నేలను తాకింది. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. రోహిత్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో అదే ఫొటోను తన ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకున్నాడు. దీని తర్వాత వివాదం మొదలైంది. చాలా మంది నెటిజన్లు టీమిండియా కెప్టెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోహిత్ ప్రొఫైల్ పిక్చర్ లో భారత త్రివర్ణ పతాకం నేలను తాకినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971 ప్రకారం ‘ఉద్దేశపూర్వకంగా జాతీయ జెండాను నేలను తాకకూడదు’ ఒక అభిమాని హిట్ మ్యాన్ పై ఆగ్రహం వ్యక్త చేశాడు. ఈ విషయం భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా తెలియదా అని మరొకరు ప్రశ్నించారు. ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల రోహిత్ శర్మ జాగ్రత్తగా ఉండాలని కొందరు అంటున్నారు.
#NewProfilePic pic.twitter.com/aDJFxW8783
— Rohit Sharma (@ImRo45) July 8, 2024
ఓవరాల్ గా రోహిత్ శర్మ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటోలో త్రివర్ణ పతాకం నేలను తాకినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు చాలా మంది టీమ్ ఇండియా కెప్టెన్‌పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జాతీయ జెండాను గౌరవించాలని సూచిస్తున్నారు. అలాగే తన ప్రొఫైల్ పిక్చర్ నుండి ఆ ఫోటోను వెంటనే తొలగించాలని కూడా కోరుతున్నారు. మరి ఈ వివాదంపై రోహిత్ శర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Still thinking about last night.
Thank you for all the love ❤️ pic.twitter.com/bzX3nhhTIw— Rohit Sharma (@ImRo45) July 5, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..