డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత టీమిండియా మరో టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధం అవుతోంది. ఆగష్టు 4 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. దీని కోసం భారత ఆటగాళ్లు ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు రికార్డు ఏమాత్రం బాగోలేదు.
ఇప్పటిదాకా మొత్తం 63 టెస్టులు ఆడిన టీమిండియా కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. 35 టెస్టుల్లో ఓటమి చవి చూడగా.. 21 టెస్టులు డ్రాగా ముగిశాయి. ఇక ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కూడా టీమిండియా పరాజయం పాలైంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైంది. మరి ఈసారైన టీమిండియా ఐదు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకుంటుందా.? లేదా.? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే అభిమన్యు ఈశ్వరన్ సెలక్షన్ ఇప్పుడు టీం మేనేజ్‌మెంట్.. చీఫ్ సెలెక్టర్ మధ్య పెద్ద వివాదానికి దారి తీసింది. అతడి బ్యాటింగ్ టెక్నిక్ టెస్టులకు పనికిరాదని కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి, మిగతా సిబ్బంది అంటుంటే.. కోహ్లీ పర్యవేక్షణలోనే టీంను సెలెక్ట్ చేశామని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదం ఎప్పటికి తేలుతుందో వేచి చూడాలి.
Also Read:
రాత్రుళ్లు కోళ్లు మాయం.. బోను ఏర్పాటు చేయగా.. చిక్కిన జంతువును చూసి రైతు షాక్.!
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్.. గంటలో రూ. 1 లక్ష విత్‌డ్రా!
మొసలి, సింహాల భీకర పోరు.. గెలిచిందెవరు.? ఈ షాకింగ్ వీడియో మీకోసమే!