Team India 2023: కొత్త సంవత్సరం.. కొంగొత్త ఆశలు.. ఈ ఏడాదిలో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే

|

Jan 01, 2023 | 7:22 AM

కొత్త సంవత్సరంలో కొంగొత్త ఆశలతో ప్రపంచ క్రికెట్ వేదికపై ఆధిపత్యం చెలాయించేందుకు టీమిండియా సిద్ధమైంది.ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో భారత్‌లోనే జరగనుంది. టీమిండియా దృష్టంతా ప్రస్తుతం ఈ మెగా టోర్నీపైనే ఉంది. స్వదేశంలో మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని తహతహలాడుతోంది.

Team India 2023: కొత్త సంవత్సరం.. కొంగొత్త ఆశలు.. ఈ ఏడాదిలో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే
Team India
Follow us on

భారత జట్టుకు 2022 సంవత్సరం పెద్దగా అచ్చిరాలేదు. ఈ ఏడాది రెండు పెద్ద టోర్నీల్లో విఫలమైన టీమిండియా .. ఆసియా కప్-2022లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. కనీసం ఫైనల్‌కు కూడా చేరుకోలేదు. అదే సమయంలో ICC T20 ప్రపంచ కప్‌లోనూ రాణించలేకపోయింది సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో ఓడిపోవడంతో నిష్క్రమించింది. ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొంగొత్త ఆశలతో ప్రపంచ క్రికెట్ వేదికపై ఆధిపత్యం చెలాయించేందుకు టీమిండియా సిద్ధమైంది.ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో భారత్‌లోనే జరగనుంది. టీమిండియా దృష్టంతా ప్రస్తుతం ఈ మెగా టోర్నీపైనే ఉంది. స్వదేశంలో మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని తహతహలాడుతోంది. 2011లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను భారత్ చివరిగా గెలుచుకుంది. అలాగే శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో టీమిండియా సిరీస్‌లు ఆడాల్సి ఉంది. మరి ఈ ఏడాది భారత జట్టు ఆడే మ్యాచ్‌లు, షెడ్యూల్‌ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

లంకతో మొదలై..

ఈ ఏడాదిని టీమిండియా మొదట శ్రీలంకను ఢీకొట్టనుంది. స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌లో శ్రీలంకతో భారత్‌ మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది.

టీ20 సిరీస్‌ షెడ్యూల్‌

ఇవి కూడా చదవండి

1వ T20 – జనవరి 3, వాంఖడే స్టేడియం, ముంబై
2వ T20 – జనవరి 5, MCA స్టేడియం, ముంబై
3వ T20 – జనవరి 7, SCA స్టేడియం, రాజ్‌కోట్

వన్డే సిరీస్‌ షెడ్యూల్‌

1వ ODI – జనవరి 10, బర్సపరా స్టేడియం, గౌహతి
2వ ODI – జనవరి 12, ఈడెన్ గార్డెన్స్ స్టేడియం, కోల్‌కతా
3వ ODI – జనవరి 15, గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం

న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా

మొదటి వన్డే – జనవరి 18, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
రెండో వన్డే – జనవరి 21, షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం, రాయ్‌పూర్
మూడో వన్డే – జనవరి 24, హోల్కర్ క్రికెట్ స్టేడియం, ఇండోర్

1వ T20 – 27 జనవరి, JSCA ఇంటర్నేషనల్ స్టేడియం, రాంచీ
2వ T20 – 29 జనవరి, ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో
3వ T20 – 1 ఫిబ్రవరి, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్

భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన

1వ టెస్ట్, 9-13 ఫిబ్రవరి, VCA స్టేడియం, నాగ్‌పూర్
2వ టెస్ట్, 17-21 ఫిబ్రవరి, అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ
3వ టెస్ట్, మార్చి 1-5, HPCA స్టేడియం, ధర్మశాల

1వ ODI, మార్చి 17 – వాంఖడే స్టేడియం, ముంబై
2వ ODI, మార్చి 19 – VDCA క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం
3వ ODI, మార్చి 22 – MA చిదంబరం స్టేడియం, చెన్నై

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్‌లో జరగనుంది. మరి ఈ టోర్నీ ఫైనల్‌కు భారత జట్టు చేరుతోందా లేదా అన్నది చూడాలి. ఈ ఛాంపియన్‌షిప్‌ను కూడా జూన్‌లో నిర్వహించనున్నారు. తేదీలు ప్రకటించలేదు కానీ జూన్ రెండో వారంలో ప్రారంభం కావచ్చు.

వెస్టిండీస్ భారత పర్యటన

జూలై-ఆగస్టులో భారత జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. మ్యాచ్‌ల తేదీలను ఇంకా ప్రకటించలేదు.

ఆస్ట్రేలియా టూర్‌ ఆఫ్‌ ఇండియా

ఫిబ్రవరి-మార్చిలో భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబర్‌లో భారత్‌కు తిరిగి వచ్చి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌ల తేదీలను ఇంకా ప్రకటించలేదు. దీని తర్వాత నవంబర్‌లో ఆస్ట్రేలియా మళ్లీ భారత్‌కు వచ్చి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.

ACC ఆసియా కప్-2023

అక్టోబర్‌లో జరిగే ఆసియా కప్‌లో టీమిండియా ఆడడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ టోర్నీ పాకిస్థాన్‌లో జరుగుతుండడంతో భారత్‌ ఆడదని బీసీసీఐ చెబుతోంది. దీంతో టోర్నీ వేదిక మారే అవకాశం ఉంది. అలాగే మ్యాచ్‌ల తేదీలు ఇంకా ఖరారు కాలేదు.

దక్షిణాఫ్రికా పర్యటనతో ముగింపు

ఏడాది చివర్లో భారత్‌ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్‌ నుంచి ఈ టూర్‌ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భారత్‌ రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..