AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20I Record Breakers : టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన టాప్ బ్యాటర్లు వీరే.. లిస్టులో మనోళ్లు ఎక్కడున్నారంటే ?

T20I Record Breakers : క్రికెట్ ఫ్యాన్స్‌కు అసలైన కిక్ ఇచ్చే ఈ ఫార్మాట్‌లో ఎంతో మంది బ్యాటర్లు తమ వీరబాదుడుతో చరిత్ర సృష్టించారు. ఆరోన్ ఫించ్ 172 పరుగులతో టాప్ రికార్డును కలిగి ఉన్నాడు. భారత్ తరపున అభిషేక్ శర్మ 135 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.

T20I Record Breakers : టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన టాప్ బ్యాటర్లు వీరే.. లిస్టులో మనోళ్లు ఎక్కడున్నారంటే ?
Aaron Finch
Rakesh
|

Updated on: Mar 22, 2026 | 7:00 PM

Share

T20I Record Breakers : టీ20 క్రికెట్ అంటేనే మెరుపు వేగం.. బంతి పడితే బౌండరీ అవతల ఉండాల్సిందే. క్రికెట్ ఫ్యాన్స్‌కు అసలైన కిక్ ఇచ్చే ఈ ఫార్మాటులో ఎంతో మంది బ్యాటర్లు తమ భీభత్సకర బ్యాటింగుతో చరిత్ర సృష్టించారు. అయితే, అందరిలోకి బాహుబలి లాంటి ఇన్నింగ్స్ ఆడి, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు మాత్రం ఒకరి పేరు మీదే ఇప్పటి వరకు పదిలంగా. ఆ రికార్డుల రారాజు ఎవరు? అసలు టాప్‎లో ఉన్న బ్యాటర్లు ఎవరు? మన భారత్ నుంచి ఎవరు టాప్‌లో ఉన్నారో తెలుసుకుందాం.

ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా):

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక స్కోరు సాధించిన రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేరిట ఉంది. 2018 జూలై 3న జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో ఫించ్ పెను తుఫాను సృష్టించాడు. కేవలం 76 బంతుల్లోనే 16 ఫోర్లు, 10 సిక్సర్లతో ఏకంగా 172 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 2013లో ఇంగ్లాండ్‌పై తాను చేసిన 156 పరుగుల రికార్డును తనే తిరగరాయడం విశేషం. టీ20ల్లో రెండుసార్లు 150 మార్కును దాటిన ఏకైక ఆటగాడు కూడా ఇతనే.

హజ్రతుల్లా జజాయ్ (అఫ్ఘానిస్తాన్):

ఈ జాబితాలో రెండో స్థానంలో అఫ్ఘానిస్తాన్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్ నిలిచాడు. 2019 ఫిబ్రవరి 23న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జజాయ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 62 బంతుల్లోనే 11 ఫోర్లు, ఏకంగా 16 భారీ సిక్సర్ల సాయంతో 162 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇతని విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా అఫ్ఘానిస్తాన్ ఆ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించగలిగింది.

మహమ్మద్ ఇహ్సాన్ (స్పెయిన్):

స్పెయిన్ క్రికెటర్ మహమ్మద్ ఇహ్సాన్ 2025లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. డిసెంబర్ 7న క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో ఇహ్సాన్ విశ్వరూపం చూపించాడు. కేవలం 63 బంతుల్లోనే 17 సిక్సర్లతో 160 పరుగులు బాది, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఒక అసోసియేట్ దేశం నుంచి వచ్చి ఇంతటి భారీ స్కోరు సాధించడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా):

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ 2016లో శ్రీలంకపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 65 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 145 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తనదైన శైలిలో వినూత్న షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టి ఈ భారీ స్కోరును సాధించాడు.

సాహిల్ చౌహాన్ (ఎస్టోనియా):

ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ 2024లో సైప్రస్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 41 బంతుల్లోనే 144 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆయన ఏకంగా 18 సిక్సర్లు బాదడం విశేషం. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా సాహిల్ చౌహాన్ పేరిటే ఉంది.

అభిషేక్ శర్మ (భారత్):

భారత జట్టు తరపున టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన రికార్డు యువ సంచలనం అభిషేక్ శర్మ పేరిట ఉంది. 2025లో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 135 పరుగులు చేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. తద్వారా అంతకుముందు శుభ్‌మన్ గిల్ (126*), విరాట్ కోహ్లీ (122*) నెలకొల్పిన రికార్డులను అధిగమించి, టీమ్ ఇండియా తరపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us