గత ఆదివారం క్రికెట్ అభిమానులకు అసలైన మజా లభించింది. టీ20 ప్రపంచకప్‌లో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియాకు శుభారంభం లభించలేదు. అయితే ఒంటరి పోరు కొనసాగించిన విరాట్ కోహ్లి.. టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ముఖ్యంగా చివరి 3 ఓవర్లలో 48 పరుగుల కావాల్సిన దశలో కోహ్లీ శివాలెత్తిపోయాడు. పాక్ జట్టు స్పీడ్ స్టర్ షాహీన్ అఫ్రిది వేసిన 18వ ఓవర్లో కింగ్ కోహ్లీ 3 ఫోర్లతో 17 పరుగులు చేశాడు. ఆ తర్వాత19వ ఓవర్ వేసిన హారిస్ రఫ్ ఓవర్లో 2 భారీ సిక్సర్లతో 15 పరుగులు చేశాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో టీమిండియాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ కోసం టీమిండియా పెర్త్ బయల్దేరింది. మరోవైపు నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్ కోసం పాకిస్థాన్ జట్టు కూడా పెర్త్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో స్టేడియం క్యాంటీన్ వద్ద ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు ఎదురెదురుపడ్డారు. విరాట్ కోహ్లీని పాక్ పేసర్లు షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ కలిశారు.
ఈ సందర్భంగా పాక్ పేసర్లు హరీస్ రౌఫ్, షాహిన్ అఫ్రిది..కింగ్ కోహ్లితో సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో క్షణాల్లోనే ఈ ఫొటో వైరల్‌గా మారింది. నెటిజన్లు సరదా కామెంట్ల చేస్తూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. వారి మధ్య ఏం సంభాషణ జరిగిందో కానీ.. టీమిండియా ఫ్యాన్స్ మాత్రం రకరకాలుగా ఊహించుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.’ కోహ్లీ భయ్యా.. నీ వల్ల మా కెరీర్ క్లోజ్ అయ్యేలా ఉంది అంటూ పాక్ పేసర్లు కోహ్లితో చెప్పుకుంటున్నారని ఒకరు కామెంట్ చేస్తే.. రాబోయే మ్యాచ్‌ల్లో గెలిచేందుకు ఏమైనా చిట్కాలు అడుగుతున్నారని మరొకరు స్పందించారు. అలాగే ‘మీ ఖేల్ ఖతం.. ఇక బ్యాగులు సర్దేసుకోండి’ అంటూ కోహ్లి పాక్ బౌలర్లకు చెబుతున్నాడని ఇంకొకరు ఫన్నీగా రాసుకొచ్చారు. మొత్తానికి ఈ ఫొటోపై నెట్టింట్లో మీమ్స్ హోరెత్తుతున్నాయి.
Haris Rauf and Shaheen Afridi chat with Virat Kohli ?
The trio looks in a good mood ?#ViratKohli #HarisRauf #T20WorldCup #ShaheenAfridi pic.twitter.com/VmJTDrHzjF
— Cricket Pakistan (@cricketpakcompk) October 29, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..