MS Dhoni: ఎంఎస్ ధోనీ గొప్పతనం.. ఆసక్తికర విషయం వెల్లడించిన గంగూలీ

|

Oct 13, 2021 | 7:50 AM

ఈ నెల 17 నుంచి యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ పోరు ప్రారంభం కానుండటం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ ఆడనున్న టీమిండియా జట్టుకు మాజీ కెప్టెన్ ధోనీ మెంటర్‌గా వ్యవహరించనుండటం ఆసక్తి కలిగిస్తోంది.

MS Dhoni: ఎంఎస్ ధోనీ గొప్పతనం.. ఆసక్తికర విషయం వెల్లడించిన గంగూలీ
MS Dhoni
Follow us on

T20 Worldcup 2021: ఈ నెల 17 నుంచి యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ పోరు ప్రారంభం కానుండటం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ ఆడనున్న టీమిండియా జట్టుకు మాజీ కెప్టెన్ ధోనీ మెంటర్‌గా వ్యవహరించనుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఐసీసీ వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ అందించడంతో పాటు అత్యంత విజయవంతమైన టీమిండియా కెప్టెన్‌గా ధోనీకి గుర్తింపు ఉంది. ఆయన సేవలు టీ20 వరల్డ్ కప్ పోరులో టీమిండియాకు ప్లస్ అవుతాయని.. భారత జట్టు తప్పనిసరిగా టీ20 కప్ గెలుస్తుందని అభిమానులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ధోనీ వ్యూహాలు తప్పనిసరిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు అక్కరకు వస్తాయని భావిస్తున్నారు.

టీమిండియా మెంటర్‌గా సేవలంధించనున్న ధోనీకి బీసీసీఐ భారీ మొత్తాన్ని చెల్లించవచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ క్లారిటీ ఇచ్చారు. మెంటర్‌గా సేవలంధించేందుకు ధోనీ ఎలాంటి ఫీజులు తీసుకోరని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎలాంటి ఫీజు లేకుండా ధోనీ టీమిండియాకు సేవలందిస్తుండటం పట్ల ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ధోనీ ది గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు.

40 ఏళ్ల ఎంఎస్ ధోనీ గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. చివరగా 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ ఆడారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమి చెవిచూసింది. తన కెరీర్‌లో 90 టెస్ట్ మ్యాచ్‌లలో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10,773 పరుగులు, 98 టీ20ల్లో 1617 పరుగులు సాధించారు. చెన్నై సూపర్ కింగ్స్‌ను సక్సస్‌ఫుల్ ఐపీఎల్ ఫ్రాంచైజ్‌గా నిలపడంలోనూ ధోనీ కీలక పాత్ర పోషించాడు.

Also Read..

SBI Fixed Deposit: సీనియర్‌ సిటిజన్లకు ఎస్‌బీఐ ప్రత్యేక ఆఫర్‌.. ఈ పథకం ద్వారా ఎన్నో ప్రయోజనాలు..!

Viral Photos: వీళ్ల టెక్నిక్‌ల ముందు ఇంజ‌నీర్ల తెలివి కూడా ప‌నికిరాదు..! ఫొటోలు చూస్తే షాక్ అవుతారు..

రైతులకు ప్రధాని నరేంద్రమోడీ గుడ్ న్యూస్‌..! ఆ పథకం కోసం మరిన్ని సబ్సిడీ నిధులు విడుదల..