T20 world cup: తొలి విజయం ఆస్ట్రేలియా సొంతం.. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కంగారుల హవా..

|

Oct 23, 2021 | 8:15 PM

T20 world cup: టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో..

T20 world cup: తొలి విజయం ఆస్ట్రేలియా సొంతం.. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కంగారుల హవా..
T20 World Cup
Follow us on

T20 world cup: టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. సౌతాఫ్రిక నిర్ణీత 20 ఓవర్‌లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆసిస్‌ తొలి నుంచి ఆచితూచి ఆడింది. ఈ క్రమంలోనే వికెట్లు కోల్పోయి ఒకానొక సమయంలో కష్టాల్లోకి జారుకుంది. 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. స్టీవ్‌ స్మిత్‌ 35 పరుగులతో రాణించి జట్టుకు భరోసా ఇచ్చాడు.

దీంతో ఐదు వికెట్ల నష్టానికి 19.4 ఓవర్‌లలో 121 పరుగులు సాధించి ఆస్ట్రేలియా జయకేతనాన్ని ఎగరవేసింది. స్మిత్‌ తర్వాత డేవిడ్ వార్నర్ (14), మ్యాక్స్‌వెల్ (18), మార్ష్‌ (11) పరుగులు చేశారు. ఇక మార్కస్‌ స్టొయినిస్ (24*), మ్యాథ్యూ వేడ్ (15*) రాణించి వికెట్ల పడకుండా ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇక సౌతాఫ్రిక బౌలర్ల విషయానికొస్తే.. నార్జే 2.. రబాడ, మహరాజ్, షంసి తలో వికెట్ తీశారు.

ఇక అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా వేగంగా వికెట్లను కోల్పోయింది. మారక్రమ్‌ 40 పరుగులు చేయడంతో 118 పరుగులు అయినా చేయగలిగింది. తదుపరి వచ్చిన బ్యాట్స్‌మెన్‌ అంతా స్వల్ప పరుగులకే వెనుతిరిగారు.

Also Read: AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి..

PM Modi: వ్యాక్సిన్ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని మోడీ సమావేశం.. ఈ అంశాలపై సంచలన నిర్ణయం..

Viral Video: తరగతి కిటికీ దగ్గర కదులుతున్న ఆకారం.. భయంతో వెళ్లిన విద్యార్ధులు.. చూడగానే షాక్.!