టీ20 ప్రపంచ కప్ ట్రోఫీకి సమయం ఆసన్నమవుతోంది. రోజు రోజుకు ఈ టోర్నీపై ఆసక్తి పెరుగుతోంది. అన్ని జట్లు దాదాపు తన ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నాయి. తాజాగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీకి సంబంధించిన ఓ వీడియోను పంచుకుంది. దీనిలో టీమిండియా యువ కీపర్ కం బ్యాటర్ రిషబ్ పంత్(Rishabh Pant)ను హైలెట్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఐసీసీ విడుదల చేసిన వీడియోలో పంత్ లుక్, స్టైల్ కూడా చాలా డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసింది. ‘వెల్‌కం టు ద బిగ్ టైం, రిషబ్ పంత్’ అంటూ క్యాఫ్షన్ అందించింది.
వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ గత కొన్నేళ్లుగా టీమ్ ఇండియాలో అత్యంత ఎమర్జింగ్ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో టీమ్ ఇండియాను చాలా దూరం తీసుకెళ్లగల సత్తా అతనికి ఉందని అంతా భావిస్తున్నారు. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలో పరుగులు చేసి, మ్యాచ్‌లను గెలిచి భారత్ తన సత్తాను నిరూపించుకుంది. వైట్ బాల్ క్రికెట్ టీ20 ప్రపంచకప్‌లో మెరిసేందుకు అతనికి గోల్డెన్ ఛాన్స్ ఉంది. అందుకే ఐసీసీ కూడా ఇదే కారణంతో క్యాఫ్షన్ అందించినట్లు తెలుస్తోంది.