T20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ వరుస విజయాలకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేసింది . సెయింట్ లూసియా వేదికగా శుక్రవారం (జూన్ 21) జరిగిన సూపర్-8 రౌండ్‌లో భాగంగా ఇంగ్లండ్ పై ఉత్కంఠ విజయం సాధించింది దక్షిణాఫ్రికా. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టులో ఓపెనర్ క్వింటన్ డి కాక్ (38 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 4 ఫోర్లతో 65 పరుగులు) అర్ధ సెంచరీ చేశాడు. అయితే మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బాధ్యతాయుత బ్యాటింగ్‌ను ప్రదర్శించిన హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్‌లు అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో చివరి ఓవర్‌లో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. అయితే ఈసారి ఐడెన్ మార్క్రామ్ అద్భుత క్యాచ్ పట్టడంతో మ్యాచ్ మొత్తం మారిపోయింది.
ఎన్రిక్ నోకియా వేసిన 20 ఓవర్ తొలి బంతికి హ్యారీ బ్రూక్ స్ట్రెయిట్ హిట్ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు. గాలిలో బంతిని చూసిన ఐడెన్ మార్క్రామ్ మిడ్-ఆఫ్ నుండి వెనుకకు పరుగెత్తాడు. అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టాడు. ఈ అద్భుతమైన క్యాచ్ కారణంగా, 37 బంతుల్లో 53 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్ ఔట్ అయ్యాడు. దీంతో తర్వాత వచ్చిన బ్యాటర్లు ఒత్తిడికి గురవడంతో ఇంగ్లాండ్ చివరి ఓవర్ లో 6 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా దక్షిణాఫ్రికా జట్టు 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.
ఈ విజయంతో దక్షిణాఫ్రికా సెమీఫైనల్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకుంది. సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో గ్రూప్ టూలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక ఇంగ్లండ్ రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక ఓటమితో రెండు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
The Proteas have clinched a thriller 🤩🇿🇦
A remarkable bowling effort helps South Africa stay unbeaten in the #T20WorldCup 2024 🔥#ENGvSA | 📝: https://t.co/B2JSqzDbSU pic.twitter.com/WORk8Rv3aF
— ICC (@ICC) June 21, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..