IND vs BAN: బంగ్లాతో కీలక మ్యాచ్‌.. టీమిండియాలోకి సెన్సేషనల్ ప్లేయర్! ప్లేయింగ్-XI ఇదిగో

|

Jun 22, 2024 | 1:21 PM

IND vs BAN, T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌లో 47వ మ్యాచ్‌లో భాగంగా శనివారం (జూన్ 22) భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా మ్యాచ్ కోసం టీమ్ ఇండియా తన ప్లేయింగ్ స్క్వాడ్‌లో

IND vs BAN: బంగ్లాతో కీలక మ్యాచ్‌.. టీమిండియాలోకి సెన్సేషనల్ ప్లేయర్! ప్లేయింగ్-XI ఇదిగో
Ind Vs Ban, T20 World Cup 2024
Follow us on

IND vs BAN, T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌లో 47వ మ్యాచ్‌లో భాగంగా శనివారం (జూన్ 22) భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా మ్యాచ్ కోసం టీమ్ ఇండియా తన ప్లేయింగ్ స్క్వాడ్‌లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం దాదాపు లేదు. ఎందుకంటే అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా జట్టు ప్రదర్శన ఇచ్చింది. అందువల్ల, బంగ్లాదేశ్‌పై కూడా అదే ప్లేయింగ్ ఎలెవన్‌ను కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో ఈ మ్యాచ్ లోనూ టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ రిజర్వ్ బెంచ్ కే పరిమితం కావొచ్చు. ఎందుకంటే గత మ్యాచ్ లో సిరాజ్ కు బదులుగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు అవకాశం కల్పించారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కుల్దీప్ 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అందువల్ల నేటి మ్యాచ్ లోనూ ఈ సీనియర్ స్పిన్నర్ ఆడే జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టీమ్ ఇండియా ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నారు. రిషబ్ పంత్ మూడో స్థానంలో కొనసాగనున్నాడు. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ నాలుగో నంబర్‌లో, శివమ్ దూబే ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేయనున్నారు.

హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆల్ రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కనుంది. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ పేసర్లుగా ప్లేయింగ్ ఎలెవన్‌లో కనిపించనున్నారు. ఒక వేళ యశస్వి జైస్వాల్ కు అవకాశం ఇవ్వాలనుకుంటే శివమ్ దూబేను పక్కకు తప్పించవచ్చు. అప్పుడు కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రవీంద్ర జడేజా ప్లేస్ లో యుజువేంద్ర చాహల్ కు ప్లేస్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ దాదాపు ఇలాగే ఉండొచ్చు

ఇవి కూడా చదవండి

టీమ్ ఇండియా ప్లేయింగ్-XI (అంచనా):

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

బంగ్లాదేశ్ జట్టు:
తాంజిద్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, ముహమ్మదుల్లా, రిషాద్ హుస్సేన్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, తాంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ ఇస్లాం, తన్వే రహమాన్, , షోరిఫుల్ ఇస్లాం, సౌమ్య సర్కార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..