IND vs IRE: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయంతో మైదానం వీడిన రోహిత్..

Rohit Sharma Retired Hurt: బుధవారం న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ యాభై పరుగులు చేసిన తర్వాత.. రిటైర్డ్‌గా మైదానం వీడాడు. రోహిత్ 37 బంతుల్లో 52 పరుగుల వద్ద ఉన్నాడు. 97 పరుగుల ఛేదనలో భారత్ 10 ఓవర్ల తర్వాత 76 పరుగులు చేసిన సమయంలో.. రోహిత్ భుజం నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో అసౌకర్యంగా ఫీలవుతూ.. డగౌట్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

IND vs IRE: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయంతో మైదానం వీడిన రోహిత్..
Rohit Sharma Retired Hurt

Updated on: Jun 05, 2024 | 11:17 PM

Rohit Sharma Retired Hurt: బుధవారం న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ యాభై పరుగులు చేసిన తర్వాత.. రిటైర్డ్‌గా మైదానం వీడాడు.

రోహిత్ 37 బంతుల్లో 52 పరుగుల వద్ద ఉన్నాడు. 97 పరుగుల ఛేదనలో భారత్ 10 ఓవర్ల తర్వాత 76 పరుగులు చేసిన సమయంలో.. రోహిత్ భుజం నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో అసౌకర్యంగా ఫీలవుతూ.. డగౌట్‌కు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

అయితే, సరైన కారణం ధృవీకరించనప్పటికీ, జోష్ లిటిల్ విసిరిన బౌన్సర్ రోహిత్ భుజంపై తగిలింది. దీంతో గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, మ్యాచ్ విజయం తర్వాత ప్రజంటేషన్ లో రోహిత్ కనిపించాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గాయం చిన్నదా, పెద్దదా అనేది తెలియాల్సి ఉంది. తీవ్రమైన గాయంగా మారితే మాత్రం టీమిండియాకు చాలా నష్టం జరుగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..